కూరగాయలు అమ్మేవాడూ కామెంట్ చేసాడు: సమీరా రెడ్డి
సమీరా రెడ్డి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అగ్ర కథానాయిక
సమీరా రెడ్డి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోల సరసన నటించింది. అయితే కొన్నేళ్ల క్రితం ప్రముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడిన సమీరా నటనా రంగం నుంచి వైదొలిగింది. సమీరాకు ఇద్దరు పిల్లలు. ఇటీవల తనలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులపై కామెంట్లను ఎదుర్కొన్నానని తెలిపింది. ప్రసవానంతరం మార్పులతో తాను చాలా సమస్యల్ని ఎదుర్కొన్నానని సమాజం నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవ్వడంతో చాలా కాలం బయటకు రాకుండా దాక్కున్నానని కూడా వెల్లడించారు సమీరా.
తన మొదటి కొడుకు హన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత తాను చాలా బరువు పెరిగానని ఆ తర్వాత చాలా మంది తన శరీరంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సమీరా రెడ్డి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన శరీరంపై కామెంట్లు చేసిన వారిపై సమీరా రెడ్డి విరుచుకుపడింది. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సంగతుల్ని సమీరా ముచ్చటించారు. తాను 2015లో తన కొడుకు హన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత చాలా బరువు పెరిగానని .. ఆ సమయంలో కూరగాయలు అమ్మేవాడు కూడా తనని కామెంట్ చేసాడని.. ఆ మాటలకు తాను చాలా నొచ్చుకున్నానని సమీరా తెలిపారు. అతడు ఇలా అన్నారు.. ``దీదీ క్యా హో గయా ఆప్కో ?`` (మీకు ఏమైంది?).. అని అతడు కామెంట్ చేసాడు. కొడుకు పుట్టిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉండేదని సమీరా రెడ్డి చెప్పారు.
సమీరా అసహ్యకరమైన వ్యాఖ్యల గురించి తడబడకుండా నిష్కపటంగా ఓపెనైంది. ఆమె మాట్లాడుతూ-``నా మొదటి గర్భం సమయంలో నాకు చాలా సమస్యలు ఉన్నాయి... నాకు ప్రసవానంతర బ్లూస్ వచ్చింది. నేను కూడా చాలా బరువు పెరిగాను. అసలు ప్రజలు క్షమించరు. భాజీవాలా (వెజిటేబుల్ విక్రేత) కూడా ``దీదీ క్యా హో గయా ఆప్కో? (మీకు ఏమైంది?)`` ``దీదీ ఆప్ హో? (అది నిజంగా నువ్వేనా?)`` ..``ఆప్ బాదల్ గయే హో నా మేడమ్? (మీరు కొంచెం మారారు)`` అని అతడు కామెంట్ చేసాడని సమీరా తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఇకపై తనపై ప్రభావం చూపవని సమీర పేర్కొంది. ప్రజలు నన్ను ఎలా చూస్తున్నారనే దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. నేను బయటకు వెళితే ఫోటో తీస్తారేమోనని కూడా చాలా భయపడ్డాను... అని తెలిపారు.
పిల్లలు హన్స్ - నైరా .. భర్త అక్షయ్ వర్దే ప్రముఖ నటి రేఖను కలిసినప్పటి కొన్ని త్రోబాక్ ఫోటోలను సమీరా షేర్ చేసారు. క్యాప్షన్‌లో ఆమె ఇలా రాసింది. ``నా పిల్లలు రేఖాజీని కలిసినప్పుడు (హృదయం కళ్ల ఎమోజిలు) ఈ జ్ఞాపకం నా ఫోన్‌లో కనిపించింది. ఆ రోజు నైరా పిచ్చి ఆనందంలో ఉందనేది నాకు గుర్తుంది. నేను చాలా ఇబ్బంది పడ్డాను.. రేఖాజీ అందాన్ని కాపాడుకునేందుకు సమయాన్ని ఎలా వెచ్చించిందనేది నమ్మలేకపోయాను`` అని సమీరా వ్యాఖ్యానించింది.
జై చిరంజీవ- అశోక్ లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి రేస్, డర్నా మనా హై, టాక్సీ నంబర్ 9211, దే దానా దాన్, ఆక్రోష్, ముసాఫిర్, తేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. వరణం ఆయిరమ్ లో సూర్య సరసన నటించింది. ఈ చిత్రం తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ పేరుతో విడుదలైంది. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలను విడిచిపెట్టింది. 2015లో కుమారుడు హన్స్‌కు .. 2019లో కుమార్తె నైరాకు జన్మనిచ్చింది. ఆమె ఇప్పుడు బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ద్వారా అభిమానులను ఉత్తేజపరుస్తోంది.