శోభిత మనసు చంపుకుని నటిస్తుందా?
చాలా సినిమా ల్లో పాత్రలను శోభిత మనసు చంపుకుని నటిస్తుందేమో అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు
తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్ గా అవకాశాలు రావడమే గగనం గా మారిన ఈ సమయంలో శోభిత దూళిపాళ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. శోభిత నిజంగానే తెలుగు అమ్మాయా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. తాజాగా మరో భారీ హిందీ చిత్రంలో శోభిత ఛాన్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
శోభిత తాజాగా ఒక చిట్ చాట్ లో తన మనసులోని విషయాలను చెప్పేసింది. కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నారా అంటే.. మనసుకు నచ్చిన పాత్రల్లో నటించే అవకాశాలు రాకున్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె సమాధానంతో కెరీర్ లో ఏదో అసంతృప్తి ఆమెకు ఉన్నదా అన్నట్లుగా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి, వరుసగా సినిమాలు చేయాలని నేను అనుకోవడం లేదు. వచ్చిన ప్రతి ఒక్క పాత్రను, సినిమాను చేయాలని నేను ఎప్పుడు కూడా కోరుకోను. కోరుకున్న ఆఫర్లు దక్కితే నేను ఎప్పుడు కూడా కరణ్ జోహార్, ఫరాఖాన్ వంటి స్టార్స్ సినిమా ల్లోనే నటించాలని కోరుకునేదాన్ని అన్నట్లుగా పేర్కొంది.
చాలా సినిమా ల్లో పాత్రలను శోభిత మనసు చంపుకుని నటిస్తుందేమో అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మనసుకు నచ్చే పాత్రలు రావడం లేదని ఆమె చెప్పకనే చెప్పింది. అలాంటి పాత్రల్లో నటించడం ద్వారా మనసు చంపుకున్నట్లే అవుతుంది కదా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి శోభిత కెరీర్ పరంగా మంచి జోష్ లో ఉంది. అయినా కూడా మంచి పాత్రలు, సినిమా ల్లో నటించే అవకాశాలు ఎక్కువగా రావడం లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఈమె పోషించిన పొన్నియిన్ సెల్వన్ లోని పాత్ర ఇంకా మేడ్ ఇన్ హెవన్ సిరీస్ లోని పాత్రల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఇతర సినిమాలు, పాత్రల విషయంలో ఆమె పెద్దగా సంతోషంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది.