త‌ల్లైన ఆనందంలో స్వ‌రా భాస్కర్

బాలీవుడ్ న‌టి స్వ‌రా భాస్క‌ర్ పండంటి ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నించ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌రా భాస్క‌ర్ ఫ‌హ‌ద్ అహ్మ‌ద్ జంట సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు

Update: 2023-09-26 06:41 GMT
త‌ల్లైన ఆనందంలో స్వ‌రా భాస్కర్
  • whatsapp icon

బాలీవుడ్ న‌టి స్వ‌రా భాస్క‌ర్ పండంటి ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నించ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌రా భాస్క‌ర్ ఫ‌హ‌ద్ అహ్మ‌ద్ జంట సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. బిడ్డ‌తో క‌లిసి ఉన్న స్వ‌రా దంప‌తులు ఫోటోల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. అయితే విష‌యాన్ని మాత్రం స్వ‌రా భాస్క‌ర్ ఆల‌స్యంగా రివీల్ చేసింది. ఈనెల 23న కుమార్తె జ‌న్మించింద‌ని..పేరు ర‌బియాగా నామ‌కార‌ణం చేసిన‌ట్లు తెలిపింది.

దీంతో అభిమానులు దంప‌తుల‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. జ‌న‌వ‌రి 2023 లో స‌మాజ్ వాద్ పార్టీ నేత నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ను స్వరా పెళ్లి చేసుకుంది. తొలుత కోర్టు ద్వారా ర‌హ‌స్య వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత మార్చిలో మ‌రోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత మార్చిలోనే తాను తల్లిని కాబోతున్నానంటూ ప్ర‌క‌టించింది. బేబీ బంప్‌ ఫొటోలను కూడా షేర్‌ చేశారు.

స్వ‌రా భాస్క‌ర్ 2009లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత చాలా సినిమాలు న‌టించింది. గ‌త ఏడాది రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం 'మిస్ట‌ర్ ఫ‌లానీ' అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే స్వ‌రా భాస్క‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిని పెళ్లి చేసుకోవ‌డంతో సినిమాల‌కు రిటైర్మెంట్ ఇస్తుంద‌ని అంతా భావించారు.

కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల్లకిందులు చేస్తూ అమ్మ‌డు న‌టిగా కొన‌సాగింది. భ‌ర్త రాజ‌కీయ నాయ‌కుడైతే సినిమాలు మానేయాలా? అన్న కండీష‌న్ ని అమ్మ‌డు చేధించింది. తాజాగా బిడ్డ‌కు జ‌న్మ‌నించ్చింది. గ‌ర్భం దాల్చిన త‌ర్వాత షూట్ లో పాల్గొంది. ప్ర‌స‌వం నేప‌థ్యంలో కొన్ని నెల‌లు పాటు విశ్రాంతి తీసుకుంటుంది. అటుపై మ‌ళ్లీ య‌ధా విధిగా వృత్తిలో బిజీ అయ్యే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే మ‌రో బాలీవుడ్ న‌టి ప‌రిణితి చోప్రా కూడా ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News