#కాస్టింగ్ కౌచ్.. ముక్కున వేలేసుకునేలా అదా జ‌వాబు

న‌టిగా త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను చాటుకునే అవ‌కాశం కోసం ఎదురు చూసిన అదాశ‌ర్మ‌కు ది కేర‌ళ స్టోరి దాహార్తిని తీర్చింది.

Update: 2024-09-06 06:59 GMT

అదా శర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో హార‌ర్ చిత్రంతో ప‌రిచ‌య‌మైన అదాశ‌ర్మ అటుపై పూరి జ‌గ‌న్నాథ్ `హార్ట్ ఎటాక్`(నితిన్ హీరో)తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. బ‌న్ని `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`లోను న‌టించింది. ఇటీవ‌ల `ది కేర‌ళ స్టోరి` చిత్రంతో అదాశ‌ర్మ పేరు మార్మోగింది. న‌టిగా త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను చాటుకునే అవ‌కాశం కోసం ఎదురు చూసిన అదాశ‌ర్మ‌కు ది కేర‌ళ స్టోరి దాహార్తిని తీర్చింది. కానీ ఎందుక‌నో ఆ త‌ర్వాత పెద్ద సినిమాల్లో అవ‌కాశాలైతే రాలేదు.

కెరీర్ ప‌రంగా వ‌చ్చిన డోఖా ఏమీ లేదు కానీ, పెద్ద హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకోలేక‌పోతోంది. ఇక‌పోతే మాలీవుడ్ లో మీటూ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో అదాశ‌ర్మ లైంగిక వేధింపుల గురించి ప్ర‌స్థావించ‌డంతో అది టాలీవుడ్ లోను చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవల ఎన్డీటీవీ హార్దికా గుప్తాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్‌తో తన అనుభవాల గురించి అదా శ‌ర్మ‌ ఓపెనైంది. మీరు ఎప్పుడైనా స‌హ‌చ‌రుల నుంచి అనుచితమైన ప్ర‌వ‌ర్త‌న‌ను ఎదుర్కొన్నారా? అని అడిగినప్పుడు త‌న‌దైన శైలిలో స్పందించిన అదా శ‌ర్మ హాస్యాన్ని మేళ‌వించి స‌ర్కాజ‌మ్ తో వ్యాఖ్యానించింది. అక్షరాలా అలంకారికంగా నేను నేలపై కూర్చున్నాను..! ఏ సోఫాలో కూర్చోకూడదని కూచోలేదు! అని అదా శ‌ర్మ వెల్ల‌డించింది. అలాంటి ప్ర‌శ్న‌కు.. అదా వేగంగా తెలివిగా స్పందించిన తీరు ముక్కున వేలేసుకునేలా చేసింది.

వేగంగా నిర్ణ‌యాత్మ‌కంగా ఉండాల్సిన ఒక యాక్షన్ సినిమాలోని యాక్ష‌న్ సన్నివేశంతో పోల్చింది అదా. ఎవరైనా మీద చెయ్యి వేయాల‌నుకుంటే.. యాక్షన్ సినిమాల్లో ఎవరైనా పంచ్‌లు విసిరినప్పుడు ప్రతిస్పందించడానికి మీకు అర‌సెకను స‌మ‌య‌మే ఉంటుంది. ఆ సమయంలో మీరు చేయాల్సింది చేయాలి. ఆ స‌మ‌యంలో ఎవ‌రినో సాయం అడ‌గ‌లేరు... అని అభిప్రాయ‌ప‌డింది. అదా శర్మ ఇలాంటి ఇబ్బందులను మేనేజ్ చేయ‌డంలో బలమైన సపోర్ట్ నెట్‌వర్క్ ప్రాముఖ్యత గురించి మాట్లాడింది. నెట్ వ‌ర్క్ పోషించిన పాత్రను గుర్తించాన‌ని తెలిపింది. ప‌రిశ్ర‌మ‌లో సపోర్ట్ నెట్‌వర్క్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.. నేను చాలా బలమైన మద్దతు వ్యవస్థను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను అని తెలిపింది.

2008 నుండి తన నటనా ప్రయాణం గురించి చర్చిస్తూ.. ఇది ఒక రోలర్ కోస్టర్ గా సాగింద‌ని అభివర్ణించారు. అదా మాట్లాడుతూ ``నా అరంగేట్రం.. ఆ త‌ర్వాత‌ నేను రోలర్‌కోస్టర్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. హెచ్చు తగ్గులు నన్ను ఇంతకుముందు ఇబ్బంది పెట్టేవి.. కానీ ఇప్పుడు నేను ఎత్తుపల్లాలకు అలవాటు పడ్డాను.. నేను మెట్ల‌పై నడుస్తున్నట్లు అనిపిస్తుంది`` అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అదా శర్మ తదుపరి ది గేమ్ ఆఫ్ గిర్గిట్ , రాప్‌చిక్ రీటా చిత్రాల‌లో కనిపించనుంది. అదా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లోను న‌టించింది. సెల్ఫీ, ది కేరళ స్టోరీ, బస్తర్: ది నక్సల్ స్టోరీ, హసీ తో ఫేసీ, ఫిర్, ది హాలిడే, మీట్ క్యూట్, పతి పత్నీ ఔర్ పంగా వంటి అనేక ప్రాజెక్టులలో నటించింది.

Tags:    

Similar News