అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ లో కేర‌ళ స్టోరీ బ్యూటీ

ఇది ఆదాశ‌ర్మ కెరీర్ కి ఓ ర‌క‌మైన బూస్టింగ్

Update: 2023-07-25 08:35 GMT

'ది కేర‌ళ స్టోరీ' స‌క్సెస్ తో ఆదాశ‌ర్మ పాన్ ఇండియాలో పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు వ‌ర‌కూ ఆదా శ‌ర్మ వేరు.. ఆ త‌ర్వాత వేరు అని నిరూపించిన చిత్ర‌మిది. వైవిథ్య‌మైన పాత్ర‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చిన రోల్ అది. ఆ పాత్ర కోసం ఆమె స‌న్న‌ధ‌మైన విధానం ప్ర‌తీది ఆదాశ‌ర్మ‌ని ప్ర‌త్యేకంగా ప్రోజెక్ట్ చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ గా మారింది.

ఇది ఆదాశ‌ర్మ కెరీర్ కి ఓ ర‌క‌మైన బూస్టింగ్ లా ప‌నికొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ క‌మాండోగా మరోసారి మెప్పించ‌డానికి రెడీ అవుతోంది. విద్యుత్ జ‌మాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'క‌మాండో' సిరీస్ ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. ఇన్ స్పెక్ట‌ర్ భావ‌న రెడ్డి పాత్ర‌లో ఆదాశ‌ర్మ ఆద్యంతం అల‌రించింది. తాజాగా ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నుంచి మ‌రో క‌మాండో రాబోతుంది. ఈసిరీస్ నుంచి ప్రేమ్ ప‌ర్రిజా అనే కొత్త న‌టుడు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

ఇందులో ఆదాశ‌ర్మ మ‌రోసారి కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతుంది. ఇంకా సినిమాలో వైభ‌వ్ త‌త్వవాడి.. ఇష్టియాఖాన్.. శ్రేయా చౌద‌రి..అమిత్ శియాల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేర‌ళ స్టోరీ నిర్మాత విపుల్ అమృత్ లాల్ నిర్మిస్తున్నారు. ఈ స‌న్నివేశాన్ని గుర్తు చేసుకుని ఆదాశ‌ర్మ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 'క‌మాండో ప్రాంచైజీలోకి వ‌స్తోన్న ప్రేమ్ కి స్వాగ‌తం.

కొత్త క‌మాండోతో..యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ రానుంద‌ని రాసుకొచ్చింది. చివ‌రిగా విడుద‌ల తేదిని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తారు? ద‌ర్శ‌కుడు వివ‌రాలు వంటివి గోప్యంగా ఉంచారు. ఈ చిత్రాన్ని నిర్మించేది కేర‌ళ స్టోరీ నిర్మాత కావ‌డంతో హిందీతో పాటు మ‌ల‌యాళంలోనూ తెర‌కెక్కిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News