సైకిలెక్కిన జియో సైంటిస్ట్.. ఇంట్రెస్టింగ్ గా 'శంబాల' పోస్టర్!
'శంబాల' పోస్టర్ లో మండుతున్న పొలం మధ్యలో ఆది సాయికుమార్ సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. అతను టక్ చేసుకొని, ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటున్న యువ హీరో.. ప్రస్తుతం ''శంబాల'' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నేడు ఆది సాయి కుమార్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
'శంబాల' పోస్టర్ లో మండుతున్న పొలం మధ్యలో ఆది సాయికుమార్ సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. అతను టక్ చేసుకొని, ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలో హీరో క్యారక్టర్ ఎలా ఉండబోతోంది? మూవీ కాన్సెప్ట్ ఏంటి? అనేది తెలుసుకోవాలనే ఉత్సుకతను అభిమానుల్లో రేకెత్తిస్తోంది.
''శంబాల'' అనేది ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఎ మిస్టిక్ వరల్డ్' అనేది ట్యాగ్ లైన్. 'ఎ' (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ ఉగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జియో సైంటిస్ట్ (భౌగోళిక శాస్త్రవేత్త)గా ఆది సాయికుమార్ ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. 'సూర్య45'లో కీలక పాత్ర పోషిస్తున్న స్వసిక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి అధిక బడ్జెట్‌తో 'శంబాల' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్ విజువల్స్ తో భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఆది సాయికుమార్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ తో హామీ ఇచ్చారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన గతంలో డ్యూన్, ఇన్‌సెప్షన్, బ్యాట్ మాన్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన హాన్స్ జిమ్మెర్ తో కలిసి పనిచేశారు. ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందు వినని యూనిక్, ఫ్రెష్ సౌండ్స్ ఇప్పుడు శంబాలలో వినిపిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.
శంబాల అనేది హిందూ పురాణాల్లో ప్రస్తావించబడిన ఒక ప్రత్యేకమైన నగరం. అలాంటి పేరుతో రాబోతున్న ఆది సాయికుమార్ సినిమా ఇప్పటికే జనాల దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారా ఇండియన్ స్క్రీన్ మీదకు ఒక సరికొత్త మిస్టికల్ కథను తీసుకురాబోతున్నట్లు ప్రచారం చేయబడుతోంది. ఇటీవల కాలంలో కాల్పనిక ప్రపంచంలోకి ఆడియన్స్ ను తీసుకెళ్లే సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్స్, మిస్టికల్ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రాబోతున్న 'శంబాల' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.