బాలీవుడ్‌లో బంధుప్రీతిపై ఆదిపురుష్ సీత!
ఇప్పుడు కృతి కెరీర్ పూర్తిగా గాడిలో పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ భామ రేంజ్ పెంచుకుంది.
`ఆదిపురుష్`లో సీతాదేవిగా నటించింది కృతి సనోన్. ఈ సినిమా చాలా కోణాల్లో బూమరాంగ్ అవ్వడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. దర్శకుడు ఓంరౌత్ అండర్ గ్రౌండ్ కి వెళ్లాడని, రచయితలు ఐపు లేకుండా పోయారని సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే వీటన్నిటి ప్రభావం తనపై పడకుండా జాగ్రత్త పడింది కృతి సనోన్. ఈ బ్యూటీ `మిమి` చిత్రంలో నటనకు గాను జాతీయ అవార్డును అందుకోవడం ఒక సంచలనం. ఇప్పుడు కృతి కెరీర్ పూర్తిగా గాడిలో పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ భామ రేంజ్ పెంచుకుంది.
ఇలాంటి సమయంలో కృతి సనన్ ఏం మాట్లాడినా చెల్లుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ బ్యూటీ మాట్లాడుతోంది. కృతి సనన్ బాలీవుడ్‌లో నెపోటిజం గురించి ఇప్పుడు ఓపెనైంది. ప్రపంచం ప్రతిభావంతులు, మంచి స్క్రిప్ట్‌ల వైపు మొగ్గు చూపుతోందని కూడా వ్యాఖ్యానించింది.
కృతి సనన్ హీరోపంతి చిత్రంతో అరంగేట్రం చేసింది. దీని తరువాత మిమి, ఆదిపురుష్, గణపత్ లాంటి భారీ సినిమాలు చేసింది. పదే పదే కృతి తన సినిమాల ఎంపిక, నటనా నైపుణ్యంతో తన అభిమానులను ఆకట్టుకుంది. కృతి నటనతోనే కాదు.. తన ఆలోచనలు అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించడంలోను పాపులారిటీ పెంచుకుంది.
పాపులర్ వోగ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ కృతి సనన్ బాలీవుడ్‌లో ఎవరైనా నిర్మాత ద్వారా నటీనటులు లాంచ్ అయితే.. సొంత మనుషులకే కాదు.. ప్రతిభావంతులైన వారికి కూడా కొంత చోటు ఇవ్వాలి.. అని వ్యాఖ్యానించింది. స్టార్లు, ఇతర పెద్ద పేర్ల కంటే ప్రతిభ, మంచి స్క్రిప్ట్‌ల వైపు ఈ ప్రపంచం మొగ్గు చూపుతోంది అని కూడా వ్యాఖ్యానించింది. మనం సమాన అవకాశాలను సృష్టించడం ప్రారంభించినట్లయితే పరిశ్రమ బయటి వ్యక్తులకు మరింత అందుబాటులోకి వస్తుంది. పరిశ్రమ వారసత్వం లేకపోయినా కొత్త వారే అయినా కానీ, ప్రతిభావంతులైన వారికి కూడా స్పేస్ ఇస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, స్టార్లు ఇతర పెద్ద పేర్ల కంటే ప్రతిభ- స్క్రిప్ట్‌ల వైపు ఈ సినీప్రపంచం మొగ్గు చూపుతోంది... అని వ్యాఖ్యానించింది.
నేను చాలా వీడియోలను విజన్ బోర్డులలో మానిఫెస్ట్‌లలో చూసాను. మనం ఏదైనా జరుగుతుందని విశ్వసిస్తే అది జరుగుతుంది. కానీ నాకు నేనుగా నిర్విరామంగా ఒక నిర్దిష్ట మైలురాయిని వెంబడిస్తే అది జరగదని నేను గ్రహించాను... అని కూడా కృతి వేదాంతం వల్లించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కృతి సనన్ పలు భారీ చిత్రాల్లో నటించింది. భేదియా, షెహజాదా, గణపత్, లుకా చుప్పి సహా మరెన్నో సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. `మిమీ`లో తన నటనకు ఉత్తమ నటిగా తన 69వ జాతీయ అవార్డును అందుకుంది. ఇప్పుడు కృతి ఖాతాలో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. షాహిద్ కపూర్‌తో ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమా చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల కానుంది. దీనితో పాటు టబు, కరీనా కపూర్, దిల్జిత్ దోసాంజ్‌లతో కలిసి `ది క్రూ`లో కూడా కనిపిస్తుంది.