OTTలోకి వ‌చ్చిన‌ ఆదిపురుష్.. సౌండ్ లేదేంటి?

థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత 'ఆదిపురుష్' ఈ శుక్రవారం OTTలో నిశ్శబ్దంగా స్ట్రీమింగ్ మొద‌లైంది.

Update: 2023-08-11 17:03 GMT

థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత 'ఆదిపురుష్' ఈ శుక్రవారం OTTలో నిశ్శబ్దంగా స్ట్రీమింగ్ మొద‌లైంది. ప్రభాస్- కృతి సనన్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమ‌వుతోంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో జూన్ 16న సినిమాల్లో విడుదలైంది. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఫ్లాప్ అయినప్పటికీ.. వ‌రుస వివాదాల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 393 కోట్ల రూపాయలను రాబట్టగలిగింది. సాక్ నిల్క్ విశ్లేష‌ణ‌ ప్రకారం ఆదిపురుష్‌ విడుదలైన పదకొండవ రోజు కలెక్షన్లలో ఈ చిత్రం రూ.450 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించిందని టి-సిరీస్ పేర్కొంది.

ఆదిపురుష్‌లో ప్రభాస్ 'రాఘవ' (రాముడు)గా, కృతి సనన్ 'జానకి' (సీత)గా నటించారు. సైఫ్ అలీఖాన్ 'లంకేష్' (రావణ) పాత్రను పోషించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘ‌న‌మైన ఆరంగేట్రంతో అద‌ర‌గొట్టింది. అయితే చెడు సమీక్షలు, పేలవమైన VFX, నాటు డైలాగ్‌లు బాక్సాఫీస్ లాంగ్ ర‌న్ ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా -ఓం రౌత్‌లకు ర‌క‌రకాల బెదిరింపులు ఎదుర‌య్యాయి. చెత్త డైలాగ్ రైటింగ్ అంటూ ర‌చ‌యిత ముంతాషిర్ పై విమ‌ర్శ‌లొచ్చాయి. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసినందుకు ముంతాషీర్ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాడు. నిర్మాతలు సినిమాలోని కొన్ని పంక్తులను కూడా రివైజ్ చేయాల్సి వచ్చింది.

ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. ముకుళిత హస్తాలతో, నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు భ‌జ‌రంగ్‌ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన్ .. మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక అని సోష‌ల్ మీడియాల్లో ర‌చ‌యిత ముంతాషిర్ క్ష‌మాప‌ణ‌లు కోరారు.

Tags:    

Similar News