అదితీరావ్ హైద‌రీ మొద‌టి భ‌ర్త నేప‌థ్యం?

ఈ బ్యూటీ తన 21వ ఏట కాలేజ్ ఫ్రెండ్ సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది.

Update: 2024-08-31 02:30 GMT

అదితీరావ్ హైదరీ - సిద్ధార్థ్ జంటకు ఇప్ప‌టికే నిశ్చితార్థం అయింది. ఇటీవ‌ల‌ పెళ్లి గురించి మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అదితీ స్వ‌యంగా సిధ్ ని పెళ్లాడుతున్న‌ట్టు తాజాగా ఓ చాటింగ్ సెష‌న్ లో ధృవీక‌రించింది. వ‌న‌ప‌ర్తిలోని 400 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఒక పాపుల‌ర్ దేవాల‌యంలో మా పెళ్లి జ‌రుగుతుంది! అంటూ అదితీ వెల్ల‌డించింది. అదితీరావ్- సిద్ధార్థ్ ఇద్ద‌రికీ ఇది రెండో పెళ్లి.

అయితే అదితీరావ్ హైద‌రీకి ఒక చేదు గతం ఉంది. ఈ బ్యూటీ తన 21వ ఏట కాలేజ్ ఫ్రెండ్ సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. స‌త్య‌దీప్ లాయ‌ర్.. న‌టుడిగాను సుప‌రిచితుడు. కానీ మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో అత‌డి నుంచి అదితీ విడిపోయింది. అనంత‌రం ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. కొన్నాళ్ల‌కు స‌త్య‌దీప్ పాపుల‌ర్ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నాడు. పాపుల‌ర్ మోడ‌ల్ మ‌సాబా అంత‌కుముందు నిర్మాత మ‌ధు మంతెన‌ను 2015లో పెళ్లాడారు. ఈ జంట 2019లో విడిపోయారు.

2013లో సత్యదీప్ మిశ్రాతో తన వివాహం గురించి వచ్చిన వార్తలపై వ్యాఖ్యానించడానికి అదితి రావ్ హైదరీ నిరాకరించినప్పటికీ చివరకు తాము విడిపోయామని వెల్లడించింది. 2007 లో అదితీ త‌న‌ 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. వారు 17 సంవత్సరాల వయస్సులో పాఠశాలలో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. అక్క‌డే డేటింగ్ మొద‌లైంది. అనంత‌రం పెళ్లాడారు. కానీ ఆ త‌ర్వాత బ్రేకప్ అయింది.

స‌త్య‌దీప్ తో నేను సీరియ‌స్ గా రిలేష‌న్ లో ఉన్నాన‌ని గ‌తంలో అదితీ తెలిపింది. సివిల్ సర్వెంట్.. లాయర్ అయిన సత్యదీప్‌ని 21వ ఏట వివాహం చేసుకున్నాన‌ని, ఆ త‌ర్వాత న‌టిగా మారడానికి ఆ పెళ్లిని వదులుకున్నానని కూడా అదితీ వెల్ల‌డించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ``అతడు సహజ నటుడు.. ప‌లు చిత్రాల్లో న‌టించాడు. నేను అతడిని 17 సంవత్సరాల వయస్సులో కలిశాను. అది నా సీరియ‌స్ రిలేష‌న్ షిప్‌`` అని అతిదీ వెల్ల‌డించారు. మేం స్నేహితులం.. కానీ విడిపోవ‌డం చాలా బాధ పెట్టింద‌ని కూడా అదితీ వెల్ల‌డించారు. స‌త్య‌దీప్ మిశ్రా చాలా సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టించారు.

Tags:    

Similar News