స్టార్ కపుల్ రెండో పెళ్లి వెనక అంత లాజిక్కు ఉందా?
తెలంగాణలోని ఓ పురాతన దేవాలయంలో స్టార్ హీరోతో హీరోయిన్ పెళ్లి అయింది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే అటెండయ్యారు.
తెలంగాణలోని ఓ పురాతన దేవాలయంలో స్టార్ హీరోతో హీరోయిన్ పెళ్లి అయింది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే అటెండయ్యారు. అయితే ఇప్పుడు రాజస్థాన్ లోని ఓ విలాసవంతమైన కోటలో జరిగిన రెండోసారి పెళ్లికి మాత్రం సెలబ్రిటీ స్నేహితులు హాజరై బోలెడంత సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో విడుదలయ్యాయి.
ఈ అంగరంగ వైభవమైన రాచరికపు పెళ్లితో హడావుడి చేసిన జంట ఎవరో తెలిసిందే. సిద్ధార్థ్ -అతిథీరావ్ హైదరీ జంట గురించే ఇదంతా. అయితే రెండోసారి పెళ్లి అంటూ సడెన్ గా రాజస్థాన్ లోని ఓ ఖరీదైన వెన్యూని ఎంపిక చేసుకుని, అక్కడ పెళ్లి సందడికి ప్లాన్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్లికి దుల్కార్ సల్మాన్, ఫరా ఖాన్ సహా పలువురు టాప్ సెలబ్రిటీలు అటెండయ్యారు. అయితే ఈ పెళ్లి వేడక వెనక లాజిక్ గురించి నెటిజనులు ఆరాలు తీస్తున్నారు.
సాంప్రదాయబద్దంగా చారిత్రాత్మక దేవాలయంలో మొదటిసారి పెళ్లి జరిగాక కూడా రాజస్థాన్ కోటలో రెండోసారి పెళ్లి జరిగింది. అయినా ఇంత సడెన్ గా రెండోసారి పెళ్లి దేనికి? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేసారు. అయితే ఈ పెళ్లి వెనక చాలా లాజిక్ ఉందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా కమర్షియల్ సెటప్.. ఒక మ్యాగజైన్ కవర్ షూట్ కోసం ఇలా ప్లాన్ చేసారని టాక్ వినిపిస్తోంది. చాలా మంది సెలబ్రిటీ జంటలు పెళ్లి వేడుకల కవరేజీ, స్ట్రీమింగ్ అవకాశాలను మ్యాగజైన్లు, టీవీ చానెళ్లకు విక్రయించి క్యాష్ చేసుకున్నారని కథనాలొచ్చాయి. ఇప్పుడు సిద్-అతిదీ జంట కూడా దీనినే ఫాలో చేశారన్న టాక్ వినిపిస్తోంది. వాణిజ్య ప్రకటనల ఆదాయంతో పాటు, జీవితంలో ఇలాంటి కీలకమైన సందర్భాలను కూడా ఎన్ క్యాష్ చేసుకునే అవకాశం సెలబ్రిటీలకు మాత్రమే ఉంది. దానిని ఈ తెలివైన జంట సద్వినియోగం చేసుకుందని గుసగుస వినిపిస్తోంది.