స్టార్ డైరెక్ట‌ర్ డాట‌ర్ తో ఆ ఛాన్స్ ఏ హీరోకో?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డాట‌ర్ అతిది శంక‌ర్ టాలీవుడ్ డెబ్యూ ఫిక్సైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-15 22:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డాట‌ర్ అతిది శంక‌ర్ టాలీవుడ్ డెబ్యూ ఫిక్సైన సంగ‌తి తెలిసిందే. యువ ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం ద్వారా అమ్మ‌డు ప‌రిచ‌య‌మ‌వుతోంది. త‌మిళంలో విజ‌యం సాధించిన ‘గ‌రుడ‌న్` చిత్రానికి రీమేక్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ హీరోలుగా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి ‘వీర ధీర శూర‌’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది.


అతిది కూడా సెట్లో అడుగు పెట్టింది. అయితే అతిది ఇందులో ఎవ‌రికి జోడీ? అన్న సంగ‌తి తెలియాల్సి ఉంది. ముగ్గ‌రు హీరోల్లో ఎవ‌రా ల‌క్కీ హీరో? అన్న‌ది వేచి చూడాలి. ఇందులో మ‌రో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందిట‌. అయితే మ‌రో హీరోకి మాత్రం హీరోయిన్ లేన‌ట్లు తెలుస్తోంది. స్నేహం, స్వార్థం, ప్ర‌తీకారం నేప‌థ్యంలో సాగుతుందిట‌. అతిది ఎంట్రీ సినిమాకి అద‌న‌పు అస్సెట్. ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఒకరు.

పాన్ ఇండియాలోనే కాదు పాన్ వ‌ర‌ల్డ్ లోనే ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. కానీ చాలా సింపుల్ ప‌ర్స‌న్. బాలీవుడ్..కోలీవుడ్..టాలీవుడ్ లో ఆయ‌న కోరితే కుమార్తెకి స్టార్ హీరోల స‌ర‌స‌నే అవ‌కాశాలు ఇప్పించ‌గ‌ల‌రు. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎవ‌రైనా ప్ర‌తిభ‌తో మాత్ర‌మే రాణించ‌గ‌ల‌ర‌ని న‌మ్మే వ్య‌క్తి. ఇంకా చెప్పాలంటే అతిదికి శంక‌ర్ కేవ‌లం తండ్రి మాత్ర‌మే. అత‌డి ద్వారా అతిది న‌ట‌న‌లో ప్ర‌త్యేక‌గా నేర్చుకున్న‌ది అంటూ ఏం లేదు.

న‌టిగా త‌న‌ను తానే తయారు చేసుకుని తెరంగేట్రం చేసింది. ఇప్ప‌టీకే కోలీవుడ్ లో హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది. `మావీర‌న్` సినిమాతో అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో శివ కార్తీకేయ‌న్ కి జోడీగా న‌టించింది. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ లో ఉండ‌గా, మ‌రో సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Tags:    

Similar News