'G2' - అడివి శేష్ హై బడ్జెట్ బొమ్మ!

అడివి శేష్ మరోసారి తన వినూత్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమవుతున్నారు.

Update: 2024-08-28 09:04 GMT

అడివి శేష్ మరోసారి తన వినూత్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమవుతున్నారు. 2018లో విడుదలైన ‘గూఢచారి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా సీక్వెల్ అయిన ‘G2’ భారీ అంచనాలతో రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ అడివి శేష్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది. ‘G2’లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇమ్రాన్ హష్మీ నేచురల్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకునే నటుడు, ఆయన క్రేజ్ ద్వారా ఈ సినిమా హిందీ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకోనుంది. ఈ కాంబినేషన్‌తో ‘G2’ పాన్ ఇండియా లెవెల్ లో పర్ఫెక్ట్ మూవీగా సిద్ధమవుతోందని చెప్పవచ్చు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ట్విస్టులు యాక్షన్ బ్లాక్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నాయట.

‘గూఢచారి’ సాధించిన సక్సెస్ కారణంగా అదే నమ్మకంతో మేకర్స్, ‘G2’ను అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించేలా రూపొందిస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. భారతీయ స్పై థ్రిల్లర్ జానర్ గా డిఫరెంట్ థీమ్ తో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల ‘గూఢచారి’కి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘G2’ నుండి ఆరు స్టైలిష్ లుక్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఫ్లేర్, భారీ స్కేల్, హై స్టాండర్డ్స్‌ను చూపించాయి. సినిమాకి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్ పీసెస్‌ను ఇందులో హైలెట్ చేస్తున్నారు.

అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు, పక్కా ప్లాట్ ట్విస్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ సహా పలు భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. 2025లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ', 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' 'ఏకే ఎంటర్టైన్మెంట్స్' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అడివి శేష్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News