సెల్ప్ కాన్పిడెన్స్ కోసం పెద్దాయన క్లాసులు!
సైకాలజిస్టులు..లైఫ్ కోచ్ లా క్లాస్ లు ఆ రకమైన మార్పులు తీసుకురాగలవు.
నిరాశ..నిస్పృహ మనిషి ఆలోచన తీరులో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. శారీరకంగానూ మార్పులు చోటు చేసుకుంటాయి. మొత్తంగా అన్ని కలిసి మనిషి ఆత్మవిశ్వాసంపై కోలుకోలేని దెబ్బే కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనసు..మొదడు రెండూ సక్రమంగా పనిచేయవని సైకాలజిస్టులు చెబుతుం టారు. ఆ సమయంలో మళ్లి యధాస్థితికా తిరిగి రావాలన్నా...కాన్నిడెన్స్ బిల్డ్ అవ్వాలన్నా! మనసు పనిమీద లగ్నం చేయాలన్నా బూస్టింగ్ అనేది అవసరం.
సైకాలజిస్టులు..లైఫ్ కోచ్ లా క్లాస్ లు ఆ రకమైన మార్పులు తీసుకురాగలవు. మైండ్ ని వాష్ చేసి దానికో రూపం ఇవ్వగలరు. సరిగ్గా ఇదే పనిని ఇటీవల ఓ స్టార్ హీరో చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. తాను ఒకటనుకుంటే ఫలితం ఊహించని విధంగా వస్తుంది. వరుసగా ఓ రెండు సినిమాల విషయం లో అది ప్రూవ్ అయింది.
సినిమాలు అన్నాక జయాపజయాలు సహజం. దీనికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయనకి తెలియంది కాదు! కానీ తాను తీసుకోంటున్న కొన్ని నిర్ణయాలు ఎందుకు అంగీకారంగా లేవు అన్నది ఆయన్ని వ్యక్తిగతంగా..మానసికంగా కొంత డిస్టబెన్స్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. వయసు కూడా కొంతవకూ ప్రభావం చూపిస్తుంది. దీంతో తన నిర్ణయాలు ఎందుకు తప్పుగా వెళ్తున్నాయి? అన్న ఆలోచన ఆయన లో బలంగా నాటుకుంది.
దీంతో పెద్దాయన లాభం లేదనుకుని రెట్టించిన ఉత్సాహంతో రింగులోకి దిగాలని ఏకంగా సైకాలజిస్టుల్ని..లైఫ్ కోచ్ ల్ని ఇంటికి పిలిపించుకుని క్లాస్ లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆలోచనలు.. తీసుకున్న నిర్ణయాలు ఏ కారణంగా అంగీకారంగా లేదు అన్న కోణంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆ క్లాసుల తర్వాత పెద్దాయనలో తిరిగి మళ్లీ కాన్పిడెంట్ బిల్డ్ అయినట్లు తెలుస్తుంది.
ప్రెష్ మైండ్ తో మళ్లీ రీ ప్రెష్ అయినట్లు వినిపిస్తుంది. ఇది మంచి అలవాటే. సెల్ప్ కాన్పిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇలాంటి క్లాసులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. వేల కోట్ల రూపాయలు ఇవ్వలేని ధైర్యాన్ని ఓ పవర్ ఫుల్ వర్డ్ ఇవ్వగలదు. కమిట్ మెంట్...డెడికేషన్ ఉంటే వయసుతో పనిలేకుండా అద్భుతాలు సృష్టించిన దిగ్గజాలెంతో మంది.