20 ఏళ్ల తర్వాత..మెప్పించడం సాధ్యమేనా?
టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. స్టార్ హీరోల పాత చిత్రాలన్నింటినీ 4 కెఫార్మెట్ లో మళ్లీ రిలీజ్ చేసి కాసులు చేసుకుంటున్నారు.
టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. స్టార్ హీరోల పాత చిత్రాలన్నింటినీ 4 కెఫార్మెట్ లో మళ్లీ రిలీజ్ చేసి కాసులు చేసుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి...పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ ..ప్రభాస్ సహా పలువురు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ హీరోల బర్త్ డే సంద ర్భంగా వాటిని రీ-రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఇప్పుడిదే కల్చర్ కోలీవుడ్ లోనూ కనిపిస్తుంది.
క్లాసిక్ హిట్స్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విశ్వనటుడు కమల్‌హాసన్ `అళవదన్` ని తెలుగులో `అభయ్` టైటిల్ తో రీ- రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. `అళవదన్` విడుదలై 22 పూర్తయిన సందర్భంగా మరోసారి చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపు 1000 స్క్రీన్స్‌లో 4కే టెక్నాలజీలో రిలీజ్ అవుతుంది. ఇందులో కమల్ హాసన్ రెండు భిన్న పాత్రలు పోషించారు.
ఒకటి సైకో కిల్లర్ గా..రెండు ఆర్మీ అధికారి పాత్రల్లో కనిపించారు. అందులో కమల్ నటనకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాకి కమల్ హాసన్ కథ..కథనాన్ని స్వయంగా అందించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు. కానీ చిత్రాన్ని 2023 లో రీ-రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే మేకర్స్ ఇక్కడో లాజిక్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమా ఎందుకు ఫెయిలైంది? అన్న కోణంలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
20 ఏళ్ల క్రితం ట్రెండ్ వేరు..నేటి జనరేషన్ తీరు వేరు. కంటెంట్ బేస్ట్ చిత్రాలకు ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. స్టార్ ఇమేజ్ తో పనిలేకుండా అలాంటి చిత్రాల్ని ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో `అభయ్` లో విభిన్న కోణం ఇప్పటి ఆడియన్స్ ని ఆకట్టుకునే ఛాన్స్ ఉందని టీమ్ విశ్వశి స్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవీనా టాండన్- మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 20 క్రితమే అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్‌ను కూడా దక్కించుకుంది.