హీరోయిన్లను 'ఏఐ' ఇలా కూడా ముంచుతుందా!
అయితే ఇది అందరూ అనుకుంటోన్న వీడియో కాదు. మిమీక్రీ కి సంబంధించిన వీడియో. డిమ్రీ వాయిస్ ని కియారా అద్వాణీ..పరిణీతి చోప్రా.కృతి సనన్ గోంతులుగా మార్చి ఓ వీడియో వదిలారు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వాడుకున్న వాడుకున్నంత కంపర్టుబుల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏఐతో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. లేని నటుల్ని ఉన్నట్లు సృష్టించి అంతే నేచురాలిటీని తీసుకొస్తున్నారు. మ్యూజిక్ పరంగానూ ఈ టెక్నాలజీ ఎంతో వాడుకలోకి వచ్చేసింది. ఇదే టెక్నాలజీతో హీరోయిన్ల డీప్ పేక్ వీడియోలు అంతే సంచలనం రేపుతున్నాయి.
ఎప్పుడు ఏ నటి పై ఎవరు ఎలా విరుచుకు పడతారో? తెలియని పరిస్థితి. దీంతో అందమైన హీరోయిన్లు అందరికీ అదో రకమైన టెన్షన్. బయటకు వస్తే వీలైనంత వరకూ ఎవరూ కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. స్వేచ్ఛని కోల్పోతున్నారు. అయినా ఏదో రకంగా వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా 'యానిమల్' బ్యూటీ త్రిప్తీ డిమ్రీ వీడియో ఒకటి లీకైంది.
అయితే ఇది అందరూ అనుకుంటోన్న వీడియో కాదు. మిమీక్రీ కి సంబంధించిన వీడియో. డిమ్రీ వాయిస్ ని కియారా అద్వాణీ..పరిణీతి చోప్రా.కృతి సనన్ గోంతులుగా మార్చి ఓ వీడియో వదిలారు. దీంతో ఫేస్ ఒకరిది..ముఖం ఒకరిదిగా మారింది. నిజంగా త్రిప్తీ వాయిస్ తెలియకతే భంగపడటం ఖాయం. ఆమె ఇలా మాట్లాడిందా? అనుకుంటారు. తప్పుడు పనులకు వాడనంత కాలం పర్వాలేదు.
అలా జరిగితేనే పెను ముప్పు ఉంటుంది. దీంతో నెటి జనులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో భవిష్యత్ లో చాలా పెద్ద ప్రమాదమే హీరోయిన్లు ఎదుర్కునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్పింగ్ వీడియోలకు పాల్పడిన వారిని కూడా పట్టుకోవడం సైబర్ సిబ్బంది రాను రాను కష్టంగానూ మారుతుందంటున్నారు.