17వ వేడుకతో పుకార్లకు చెక్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. గత కొన్నాళ్లుగా ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కి దూరంగా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య తెగతెంపులు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి.
మీడియాలో వస్తున్న వార్తలకు ఐశ్వర్య రాయ్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నా కూడా ఆ పుకార్లు ఆగడం లేదు. తాజాగా మరోసారి అభిషేక్ బచ్చన్ తో తాను కలిసే ఉన్నాను అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది. 17వ వివాహ వార్సికోత్సవ వేడుక జరుపుకున్న ఈ జంట సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేశారు.
కూతురుతో కలిసి ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ లు తీసుకున్న సెల్ఫీతో విడాకుల వార్తలకు, బ్రేకప్ పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్లు అయ్యింది. ఫ్యామిలీ అన్నప్పుడు సమస్యలు, గొడవలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జరిగిన విషయాలను పట్టుకుని బ్రేకప్, విడాకులు అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుందని ఈ ఫోటోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికి వస్తే గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాల సంఖ్య చాలా తగ్గించింది. ఆమె ఓకే చెప్పాలే కానీ ఏడాదికి మూడు నాలుగు సినిమా ఛాన్స్ లు అయినా ఆమెకు వస్తాయి. కానీ ఆమె మాత్రం గతంలో మాదిరిగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించడం లేదు.
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో మంచి పాత్రలో కనిపించిన ఐశ్వర్య రాయ్ తదుపరి సినిమా ఏంటా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు అభిషేక్ బచ్చన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగానే ఉంటాడు. మరో వైపు వీరి కూతురు ఆరాధ్య సినిమా ఎంట్రీ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.