కేన్స్‌లో ప్రదర్శన కోసం 47 దుస్తులతో ఐష్ దిగింది కానీ!
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ తో ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలిసిందే
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ తో ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలిసిందే. 2002 నుండి ఐష్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతోంది. అప్పటి నుండి దాదాపు అన్ని ఫెస్టివల్ ఎడిషన్‌లకు హాజరైంది. 2002లో కేన్స్‌లో మొదటిసారి కనిపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఐశ్వర్యరాయ్ 2003లో కూడా ఈ ఉత్సవానికి హాజరైంది. కానీ రెండోరి ప్రదర్శన తన రూపంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
అయితే దీనిపై డిజైనర్ నీతా లుల్లా ఇప్పుడు ఓపెనయ్యారు. ఇటీవలి ఇంటర్వ్యూలో డిజైనర్ నీతా లుల్లా ఆ సంవత్సరం కేన్స్ ఈవెంట్లో ఐష్ ప్రదర్శనలో తప్పిదం గురించి వెల్లడించారు. వివిధ సందర్భాలలో ఐశ్వర్యతో 47 దుస్తులను పంపానని నీతాజీ వెల్లడించారు. కానీ రెండోసారి కేన్స్ ప్రదర్శనలో అక్కడ ఏదో తప్పు జరిగిందని తనపై విమర్శలు వచ్చాయని అన్నారు.
నిజానికి తన పాదం ఫ్రాక్చర్ అయందని ఆ సమయంలో ఆరోగ్యం బాలేదని నీతాజీ గుర్తుచేసుకుంది. అయితే ఐష్ ధరించిన నియాన్ గ్రీన్ చీరలో ప్రదర్శనపై విమర్శలొచ్చాయి. తన ఫ్యాషన్ సెన్స్ ని తీవ్రంగా విమర్శించారు ఫ్యాషన్ పోలీసులు. అయితే మొత్తం పండుగకు ఐష్‌తో పాటు 47 దుస్తులు ఉన్నాయి. రోజంతా ఉపయోగించే దుస్తులు అందుబాటులో ఉన్నాయి.. ఉదయం దుస్తులు.. మధ్యాహ్నం దుస్తులు, సాయంత్రం దుస్తులు, రెడ్ కార్పెట్ దుస్తులు ఇలా వేలికవే ప్రత్యేకంగా డిజైన్ చేసాం. కానీ ఎక్కడో నేను ఊహించినది తేడా కొట్టింది. బహుశా టైమింగ్ సరిగా లేదు. ఒక్కోసారి దుస్తులకు తగ్గట్టు నగలు మార్చవలసి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు అని నీతాజీ చెప్పారు.
ఆ సమయంలో తాను చాలా బాధపడ్డానని అయితే ఐశ్వర్య తనకు అండగా నిలిచిందని నీతా చెప్పింది. ''చాలా మంది తోటి డిజైనర్లు మీడియా ఖచ్చితంగా ఏం జరిగిందో తెలియకుండా చేసే వ్యాఖ్యలతో ఎవరైనా కలత చెందుతారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటివరకు నాకు తెలియదు ... నాకు తెలిసినది మొదటి పేజీ .. రెండో పేజీ ఫీచర్లు మాత్రమే. నేను నిజంగా చెడ్డ డిజైనర్‌గా ఉన్నానో లేదా ఇంకేమైనా కానీ.. ఐశ్వర్యారాయ్ నా దుస్తులను ధరించి నన్ను విశ్వసిస్తోందని నేను భావించాను'' అని నీతా లుల్లా చెప్పారు.
స్టైలిస్ట్‌లందరూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి తమ డిజైనర్లతో కలిసి వెళ్లేది ఎందుకంటే ఇలాంటివి జరగకుండా చూసేందుకేనని నీతా చెప్పారు. నీతా, ఐశ్వర్యల మధ్య సినిమాల్లో చాలా కాలం అనుబంధం ఉంది. 2007లో అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్యరాయ్ పెళ్లి కోసం ఆమె కంజీవరం చీరను డిజైన్ చేసింది. ఆ చీరలో ఐష్ ముగ్ధ మనోహర రూపం అభిమానులను కట్టి పడేసింది.