వాళ్లిద్దరిలా ఐశ్వర్యారాయ్ ఎందుకు చేయలేకపోతుంది?
అందులోనూ గత పదేళ్లగా ఐశ్వర్య కెరీర్ చూస్తే కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేసింది. అందులో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలేవైనా ఉన్నాయా?
హీరోయిన్ గా ఓ స్థాయికి చేరిన తర్వాత వాళ్లంతా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపించి సక్సెస్ దిశగా అడుగులేస్తుంటారు. లేడీ సూపర్ స్టార్ నయనతార..జ్యోతిక...అనుష్క లాంటి వాళ్లు ఇప్పుడలాగే కెరీర్ సాగిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్తే బాలీవుడ్ నుంచి రాణీముఖర్జీ...విద్యాబాలన్..కరీనా కపూర్ లాంటి సీనియర్లు అదే పంథాలో కెరీర్ సాగిస్తున్నారు. ఇక నవతరం భామల విషయానికి వస్తే అలియాభట్...రష్మిక మందన్నా.. దీపికాపదుకొణే..కత్రినా కైఫ్ లు కూడా హీరోయిన్లగా నటిస్తూనే అప్పుడప్పుడు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు చేస్తున్నారు.
రాణీముఖర్జీ.. విద్యాబాలన్ లాంటి సీనియర్ నాయికలైతే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో తమకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. వీలైనంత వరకూ అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నేటించడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తూనే ప్రోఫెషనల్ గా బిజీగా ఉంటున్నారు.
కానీ వీళ్లిద్దరిలో ఐశ్వర్యారాయ్ సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం సాగలేదనే చెప్పాలి. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా సెకెండ్ ఇన్నింగ్స్ లో అంతటి ఛరిష్మాతో దూసుకుపోలేదు అని చాలా కాలంగా ఓ విమర్శ వినిపిస్తూనే ఉంది.
అందులోనూ గత పదేళ్లగా ఐశ్వర్య కెరీర్ చూస్తే కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేసింది. అందులో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలేవైనా ఉన్నాయా? అంటే 'జాజ్ బా' లాంటి ఒక సినిమా కనిపిస్తుంది.
కానీ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ ఐశ్వర్య పేరు వినిపించింది అంటే అది కేవలం పొన్నియన్ సెల్వన్ తోనే. మణిరత్నం బ్రాండ్ తోనే అది సాధ్యమైంది. ఆ రకంగా చూస్తే ఐశ్వర్యా రాయ్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల పరంగా పూర్తిగా వెనుకబడే ఉంది. సీరియస్ గా ఆమె ఆ తరహా ప్రయత్నాలు కూడా చేసినట్లు ఎక్కడా కనిపించలేదు.
లేడీ ఓరియేంటెడ్ చిత్రాల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ దక్కుతుంది. బాక్సాఫీస్ వద్ద సోలో నాయికగా సత్తా చాటడానికి అవకాశం ఉన్న ఒకే మార్గం అది. కోట్లాది మంది అభిమానులు..భారీ ఎత్తున ఫ్యాన్ బేస్ ఉన్నాఐశ్వర్య ఆ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే ఆమె శరీరంలో వస్తోన్న కొన్ని రకాల మార్పులతో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కుంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 50. ప్రయోగాలు చేసే ఏజ్ కూడా కాదు. మళ్లీ 25 ఏళ్ల క్రితం నాటి ఐశ్వర్యని చూపించడం అంటే సవాల్ తో కూడుకున్నదే.