అజిత్ అందులోనూ తగ్గేదిలే..!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఓ పక్క స్టార్ హీరోగా సినీ ప్రేక్షకులను అభిమానులను అలరిస్తూనే ఉంటూ మరోపక్క తనకు ఇష్టమైన రేసింగ్ ను కూడా కొనసాగిస్తున్నాడు.

Update: 2024-09-29 10:09 GMT

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఓ పక్క స్టార్ హీరోగా సినీ ప్రేక్షకులను అభిమానులను అలరిస్తూనే ఉంటూ మరోపక్క తనకు ఇష్టమైన రేసింగ్ ను కూడా కొనసాగిస్తున్నాడు. స్టార్ హీరోల్లో రేసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్. ఆయన ఒక రేసర్ కాబట్టే ఆయన సినిమాలోని యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఐతే అజిత్ ఒక యాక్సిడెంట్ కారణంగా చాలా ఏళ్లు రేసింగ్ కు దూరంగా ఉన్నారు. సినిమాలు కూడా ఆ టైం లో తగ్గించారు. ఐతే ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ వరల్డ్ ట్రిప్ వేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా అజిత్ మళ్లీ తిరిగి రేసింగ్ లో పాల్గొంటున్నారు. అజిత్ కుమార్ రేసింగ్ టీం అనేది ప్రారంభించారు. అజిత్ రేసింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆయన ఫ్యాన్స్ కు సూపర్ జోష్ అందిస్తుంది. రియల్ హీరోగా అజిత్ చేసే సాహసోపేత రేసింగ్ ను చూడాలని వారు ఉత్సాహపడుతున్నారు. ఐతే అజిత్ కుమార్ రేసింగ్ టీం కోసం దుబాయ్ లో ఆటోడ్రోం లో ఫెరారీ 488 ఈవో ని టెస్ట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అజిత్ మేనేజర్ స్వయంగా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అజిత్ కుమార్ రేసింగ్ టీం కూడా రేసింగ్ లో పాల్గొననుంది. అజిత్ తో పాటు తన టీం కూడా ఇక మీదట అఫీషియల్ రేసర్స్ గా కనిపించనున్నారు. ఒకసారి యాక్సిడెంట్ అయినా కూడా అజిత్ పట్టు వదలని విక్రమార్కుడిలా తన రేసింగ్ టీం ను ఏర్పరిచారు అజిత్ కుమార్.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. అజిత్ కు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారందరికీ అజిత్ మళ్లీ తిరిగి రేసులో పాల్గొనడం క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. ఐతే అజిత్ రేసింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి సినిమాలు తగ్గిస్తాడా అన్న అనుమానాలు ఉన్నాయి. ఐతే దేనికదే పర్ఫెక్ట్ షెడ్యూల్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News