నన్ను మా అమ్మ చూసుకున్నట్లే నేను నాకూతుర్ని పెంచుతా!
రణవీర్ సింగ్ -దీపికా పదుకొణే ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ దంపతుల ప్రేమకు కానుకగా పాపాయి దువా కూడా జన్మించింది
రణవీర్ సింగ్ -దీపికా పదుకొణే ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ దంపతుల ప్రేమకు కానుకగా పాపాయి దువా కూడా జన్మించింది. ప్రస్తుతం పాప అలనా పాలనా చూసుకుంటూ దీపిక సమయం గడుపుతుంది. పాప జన్మించినప్పటికీ నుంచి దీపిక బయట పెద్దగా కనిపించడం లేదు. మీడియా కెమెరాల్లోనూ ఎక్కడా దీపిక కనిపించలేదు. దీంతో సైలెంట్ గా షూటింగ్ లో పాల్గొంటుందా? అన్న సందేహం వచ్చేసింది.
ఈ నేపథ్యంలో ఆ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దీపిక లైన్ లోకి రావాల్సి వచ్చింది. తాను ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో పాల్గొనలేదని తెలిపింది. ప్రస్తుతం పాపకే సమయాన్ని కేటాయించినట్లు స్పష్టం చేసింది. పాప బాధ్యతలు, సంరక్షణ పక్కన బెట్టేసి షూటింగ్ లో ఎలా పాల్గొంటాను? అలాంటి ఆలోచన నాలో లేదు. నా కుమార్తెను నేనే దగ్గరుండి పెంచాలనుకుంటున్నా. ఎందుకంటే మా అమ్మ నన్ను అంతే దగ్గరుండి అపురూపంగా చూసుకుంది.
నేను కూడా మా అమ్మ లాగే దువాకి అన్ని రకాల ప్రేమను పంచాలి. అప్పుడే కన్నతల్లి సంతోషంగా ఉండ గలు గుతుంది` అని అన్నారు. దీపిక కొంత కాలంగా కొత్త సినిమాలేవి కమిట్ అవ్వడం లేదు. గర్భందాల్చిన తర్వాత పూర్తిగా దూరమైంది. అటుపై ప్రసవం, పాప సంరక్షణలోనే బిజీ అయింది. అయితే `కల్కి 2898` కోసం మాత్రం గర్భంతోనే షూటింగ్ లో పాల్గొంది. ఆ సినిమాలో ఆమె పాత్ర కూడా అప్పటికి తన రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది.
ఆ సినిమాలోనూ గర్భవతిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `కల్కి 2898` రెండవ భాగం షూట్ లో పాల్గొంటుందనే ప్రచారం మొదలైంది. కానీ ఆ వార్తల్ని ఖండించింది. ఇంకా సినిమా షూటింగ్ మొదలవ్వలేదు. ఇప్పటికే 35 శాతం పూర్తయింది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.