గంటకు 180 కి.మీ.. యాక్సిడెంట్ సమయంలో స్పీడ్!
అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వివరాల ప్రకారం... అజిత్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతడు 180 కిమీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు అని తెలిపాడు.
తమిళ స్టార్ హీరో అజిత్ వృత్తితో పాటు ప్రవృత్తితోను ప్రజల్ని ఆకర్షిస్తుంటాడు. అతడు తన అద్భుతమైన నట ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల్ని అలరిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఒక రియల్ టైమ్ రేసర్ గా కార్ రేసింగుల్లో పాల్గొంటూ గగుర్పొడిచే విన్యాసాలతో అలరిస్తున్నాడు.
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న కార్ రేసింగ్ లోను అతడు పాల్గొన్నాడు. అయితే ఇంతకుముందు ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా తళా కార్ భయంకరమైన ప్రమాదానికి గురైంది. అతడు అత్యంత వేగంగా రేసింగ్ కార్ ని డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి సైడ్ రైలింగ్ వాల్ ని ఢీకొట్టడంతో కార్ ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఇంతలోనే ఫైర్ వింగ్ అధికారి వచ్చి అతడిని ట్రాక్ నుంచి పక్కకు తీసుకుని వెళ్లారు. ఈ దృశ్యాలు ఇంతకుముందే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తళా అజిత్ కి జరిగిన ప్రమాదం చిన్నదేమీ కాదు. రేసింగ్ ట్రాక్ పై ఆ సమయంలో చాలా స్పీడ్ గా వెళుతున్నాడు.
అతడు తన కార్ ని నడుపుతూ ఎంత స్పీడ్ మెయింటెయిన్ చేసాడు? అన్నది ఇప్పుడు రివీలైంది. 24H దుబాయ్ 2025 రేసింగ్ ఈవెంట్లో భాగంగా ప్రాక్టీస్ సెషన్‌లో అజిత్ కారు కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే సైడ్ వాల్ ని ఢీకొట్టింది. తళా బృందం విడుదల చేసిన వీడియోలో అతడి కారు వాల్ లోకి క్రాష్ చేసిన తర్వాత ఏడు సార్లు గిరగిరా తిరిగింది. అనంతరం అతడిని రక్షించి అంబులెన్స్‌లో ఎక్కించారు. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వివరాల ప్రకారం... అజిత్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతడు 180 కిమీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు అని తెలిపాడు.
నటుడిగానే కాదు.. కార్ డ్రైవింగ్ బైకింగ్ అంటే అజిత్ కి విపరీతమైన పిచ్చి. దుబాయ్ లో 2025 రేసు కోసం అతడు కెప్టెన్‌గా తన బృందంతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. రేసు కోసం టీమ్ 24 గంటల పాటు డ్రైవ్ చేయాల్సి ఉంది. ప్రతి సభ్యుడు ఆరు గంటల పాటు డ్రైవ్ చేయాలి. ప్రాక్టీస్ సమయంలో ఒత్తిడికి గురైన అజిత్ కుమార్ యాక్సిడెంట్ కి గురయ్యాడు.