వీడియో : బాబోయ్‌ ఇలాంటివి నీకే సాధ్యం

ఇక సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం బాడీ డబుల్‌ టెక్నాలజీ వాడకుండా చేసే సాహసాలు మరో ఎత్తు.

Update: 2024-06-26 10:31 GMT

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ సాహసాల గురించి రెగ్యులర్‌ గా మీడియాలో వార్త కథనాలు వస్తూనే ఉంటాయి. బైక్ పై వందల కిలో మీటర్లు ప్రయాణించడం, విదేశాలకు సైతం బైక్ పై వెళ్లడం ఈయనకు మాత్రమే చెల్లింది. ఇక సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం బాడీ డబుల్‌ టెక్నాలజీ వాడకుండా చేసే సాహసాలు మరో ఎత్తు.

ఆ మధ్య ఒక సినిమా కోసం రియల్‌ స్టంట్స్ చేసిన అజిత్ కుమార్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డ అజిత్ మళ్లీ మళ్లీ అలాంటి సాహసాలను చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరో సాహసంతో అందరికి షాక్ ఇచ్చాడు.

సాధారణంగా సినిమాల్లో కారు ను పల్టీలు కొట్టినట్టుగా చూపించడం జరుగుతుంది. ఆ సమయంలో సీటులో బొమ్మను ఉంచుతారు. కానీ అజిత్ తాజా చిత్రం 'విదాముయర్చి' యాక్షన్ సన్నివేశం ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యే విధంగా చిత్రీకరించారు.

కారును పల్టీలు కొట్టించారు, అయితే ఆ కారు లో నిజంగా అజిత్ ఉన్నాడు. అత్యంత ప్రమాదకరంగా సాగిన ఈ యాక్షన్‌ సన్నివేశం కు సంబంధించిన చిత్రీకరణ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అజిత్ కి మేనేజర్‌ గా వ్యవహరిస్తున్న సురేష్ చంద్ర ఈ వీడియోలను షేర్‌ చేశారు.

Read more!

ఈ వీడియోలను చూసిన అజిత్ ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా ఇలాంటి స్టంట్స్‌, సాహసాలు నీకే సాధ్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు మీద పడుతున్నా కొద్ది అజిత్‌ ఇలాంటి సాహసాలు మరిన్ని చేయడం కొంత మందికి ఆందోళన కలిగిస్తుంది. ముందు ముందు ఇలాంటివి చేయడం మంచిది కాదని కొందరు సూచిస్తున్నారు.



Tags:    

Similar News