'ఆడు జీవితం'పై ప్లేట్ ఫిరాయించిన నటుడు!
గోర్రెల కాపరి పాత్రలో పృధ్వీరాజ్ ఒదిగిపోయిన వైనం విమర్శకుల ప్రశంసలు కురిపించింది.
మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన `ది గోట్ లైఫ్` (ఆడు జీవితం) మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన ఓ యువకుడి జీవితం బాహ్యా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన తర్వాత అతడు ఎదుర్కున్న వాస్తవ పరిస్థితులు ఆధారంగా బ్లెస్సీ దీన్ని కళ్లకు కట్టారు. గోర్రెల కాపరి పాత్రలో పృధ్వీరాజ్ ఒదిగిపోయిన వైనం విమర్శకుల ప్రశంసలు కురిపించింది.
తదుపరి అవార్డులేవైనా వస్తే ఈ సినిమాకి తప్పని సరే అనేంతగా ఫేమస్ అయింది. అయితే ఇదే సినిమాలో జోర్డన్ నటుడు అకేఫ్ నజేమ్ ఓ కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ సినిమాలో నటించినందుకు అకేఫ్ నజీమ్ సౌదీ ప్రజలకు క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. ఇందులో అకేఫ్ సంపన్న అరబ్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రపై వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఇలా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఆ పాత్రలో నటించినందుకు విచారం వ్యక్తం చేసాడు.` ఈ ప్రాజెక్ట్ సైన్ చేసే ముందు స్క్రిప్ట్‌ను పూర్తిగా చదవలేదు. ఈ సినిమా సౌదీ అరేబియా ఇమేజ్‌ని ఎలా ప్రభావితం చేస్తుందో నాకు అర్దం కాలేదు. మొదట ఆడు జీవితం సౌదీ సమాజం యొక్క విలువలను సమం చేస్తుందని మొదట నమ్మాను. కానీ ఫైనల్ ఔట్ ఫుట్ చూసిన తర్వాత సినిమా కథనం నా నమ్మకానికి విరుద్దంగా అనిపించింది.
రిలీజ్ తర్వాతే నాకు పూర్తిగా సినిమాపై ఓ అవగాహన వచ్చింది. అందుకు నేను చింతిస్తున్నాను. స్క్రిప్ట్‌ను ముందుగానే సమీక్షించడంలో ఎక్కువ శ్రద్ధ చూపించే ఉంటే బాగుండేది` అని అన్నాడు. మరి అకేఫ్ క్షమాపణలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.