అకెల్లి ట్రైల‌ర్: కొన్ని `కేర‌ళ స్టోరి` పోలిక‌లూ ఉన్నాయ్

నుష్ర‌త్ వ‌రుస సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. ఇప్పుడు వార్ నేప‌థ్యంలో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ 'అకెల్లి'లో న‌టిస్తోంది.

Update: 2023-08-05 03:37 GMT

ఇటీవ‌లి కాలం లో బాలీవుడ్ నుంచి ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు -నుష్ర‌త్ భ‌రూచ్చా. ఈ పంజాబీ బ్యూటీ ఇప్ప‌టికే న‌టిగా నిరూపించుకుని మెయిన్ లీగ్ హీరోయిన్ గా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది. నుష్ర‌త్ వ‌రుస సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. ఇప్పుడు వార్ నేప‌థ్యంలో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ 'అకెల్లి'లో న‌టిస్తోంది. హారర్-థ్రిల్లర్ ఛోరీతో మాస్‌ని ఆకట్టుకున్న తర్వాత నుష్రత్ భరుచ్చా ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ అకెల్లిలో విరోచిత పోరాటానికి దిగే యువ‌తిగా న‌టించింది. 2014లో ఇస్లామిక్ స్టేట్ సిరియా కు చెందిన ద‌ళాలు ఇరాక్‌ లోకి ప్రవేశించి అన్బర్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలను.. మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు యుద్ధంలో దెబ్బతిన్న ఇరాక్ నేపథ్యం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.

మంచి ఉద్యోగావకాశాల కోసం ఇరాక్‌కు వెళ్లే పంజాబ్‌కు చెందిన సాధారణ అమ్మాయి పాత్రలో నుష్రత్ నటించారు. తీవ్రవాద సంక్షోభం ఇరాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ప్పుడు నుష్రత్ చాలామంది మహిళల తో ఈ వార్ లో చిక్కుకున్న త‌ర్వాత యుద్ధ భూమి నుండి తప్పించుకోవడానికి నుష్రత్ ఎలా ప్రయత్నిస్తుంది? అన్న‌దే ఈ సినిమా. క‌థానాయిక‌ తన స్వేచ్ఛ మనుగడ కోసం ఎంత ధైర్యంగా పోరాడుతుంది? అనేది తెర‌పైనే చూడాలి.

తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ ఆద్యంతం ఇస్లామిక్ తీవ్ర‌వాదం ఐసిస్ భూతం గురించి చూపించారు. తీవ్రవాదులు మ‌హిళ‌ల‌ ను అత్యాచారం చేయ‌డం పిల్ల‌ల‌కు బాంబులు త‌గిలించి మార‌ణ‌కాండ‌కు పాల్ప‌డ‌డం వంటి దుర్మార్గాలు ట్రైల‌ర్ లో ఎమోష‌న్ ని ర‌గిలిస్తున్నాయి. ఇక నుష్ర‌త్ పాత్ర చిత్ర‌ణ‌ను ప‌రిశీలిస్తే కొంత‌వ‌ర‌కూ 'కేర‌ళ స్టోరీస్'లోని అదాశ‌ర్మ పోరాటాన్ని రిపీట్ చేసిన‌ట్టు స్ట్రైక్ అవుతుంది.

ప్ర‌ఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల లో ట్రైలర్‌ను షేర్ చేసారు. నుష్రత్ భారుచ్చా: 'అకెల్లి' ట్రైలర్ విడుద‌లైంది. ఆగ‌స్టు 18న సినిమా విడుదలవుతుంది... మనుగడ కోసం ఒక సాధారణ అమ్మాయి పోరాటం తెర‌ పై చూడండి. థ్రిల్లర్-డ్రామాలో నుస్ర‌త్ ప్ర‌ధాన పాత్ర‌తో నాయకత్వం వహిస్తున్నారు. నూతన దర్శకుడు #ప్రణయ్మేష్రామ్ దర్శకత్వం వహించారు. #అకెల్లిలో #నిశాంత్ దహియా, #సాహిహలేవి మరియు #అమీర్‌బౌట్రస్ కూడా ఉన్నారు... నినాద్ వైద్య, నితిన్ వైద్య, అపర్ణ పద్గాంకర్, శశాంత్ షా- విక్కీ నిర్మాతలు'' అని వెల్ల‌డించారు.

ఆగస్ట్ 18న అకెల్లి సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది. ఇది అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్ నటించిన ఘూమర్‌తో ఢీకొంటుంది. అకెల్లి ట్రైలర్ విడుదలైన వెంటనే చాలా మంది నెటిజన్లు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. స్వాతంత్ర దినోత్స‌వానికి ముందు మంచి ట్రీట్ అవుతుందంటూ ప్ర‌శంసించారు. సయామి ఖేర్ యొక్క స్పోర్ట్స్ డ్రామా ఝూమ‌ర్ తో ఈ సినిమా పోటీప‌డుతోంది. ఝూమ‌ర్ కు ఆర్ బాల్కీ దర్శకత్వం వహించారు. శుక్రవారం చిత్రబృందం విడుదల చేసిన ట్రైలర్‌కి మాస్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 18న థియేటర్లలో విడుదల కానున్నాయి.

Full View
Tags:    

Similar News