అఖండ 2 బడ్జెట్ అన్ని కోట్లా?

తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ పై ముహూర్తం షాట్ షూట్ చేశారు.

Update: 2024-10-17 04:10 GMT

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘అఖండ’ మూవీ అయితే బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘అఖండ 2: తాండవం’ ని బోయపాటి గతంలో ఎనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ పై ముహూర్తం షాట్ షూట్ చేశారు.

పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటతో కలిసి తేజస్విని ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉంది. బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి 120 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అంటే బాలయ్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కనుంది. కచ్చితంగా ఇది షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు. స్పిరిచ్యువల్ ఎలివేషన్ అండ్ మాస్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం కథ ఉండబోతోంది. అందుకే స్పెషల్ సీజీ వర్క్ కోసం బడ్జెట్ ఎక్కువ పెడుతున్నట్లు సమాచారం. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘NBK109’ సినిమా పైన కూడా 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.

ఈ సినిమాని సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ‘అఖండ 2: తాండవం’ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతోందని తెలుస్తోంది. అఖండకి మించిన పవర్ ఫుల్ ఎలివేషన్ తో ఈ సీక్వెల్ ని బోయపాటి తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ చిత్రంతో బాలయ్యకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ క్రియేట్ అయితే తరువాత అతని నుంచి రాబోయే సినిమాలు కూడా అదే రేంజ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

బాలయ్య ప్లానింగ్ లో ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో పాటు ‘భైరవద్వీపం’ సీక్వెల్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని బాలయ్య అనుకుంటున్నారు. ‘అఖండ 2’ తర్వాత వాటికి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News