సింహం అప్పుడే శివ తాండ‌వం ఆడేస్తుందా!

అయితే ఆ సినిమాతో సంబంధం లేకుండా సింగం `అఖండ‌-2` కోసం బ‌రిలోకి దిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌`కు సీక్వెల్ గా `అఖండ‌-2` తాండ‌వం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-11 06:27 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ 109వ చిత్రం `డాకు మాహారాజ్` బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్ అవుతున్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇంకో వైపు ప్ర‌చారం ప‌నులు సైతం మొద‌లు పెట్ట‌డానికి టీమ్ రెడీ అవుతుంది. బాల‌య్య కూడా అవ‌స‌రం మేర సెట్స్ కి వెళ్తున్నారు.

అయితే ఆ సినిమాతో సంబంధం లేకుండా సింగం `అఖండ‌-2` కోసం బ‌రిలోకి దిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌`కు సీక్వెల్ గా `అఖండ‌-2` తాండ‌వం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి వెండి తెర‌పై బాల‌య్య ని నెక్స్ట్ లెవ్ లో చూపిస్తారు అనే అంచ‌నాలున్నాయి. బాల‌య్య నుంచి తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి స్పెష‌లిస్ట్ అని తెలుసు. కానీ ఈసారి అంత‌కు మించి అంచ‌నాల‌తో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో బోయ‌పాటి అందుకు త‌గ్గ‌ట్టే ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు.

బాల‌య్య అఖండ‌-2 షూటింగ్ కి వెళ్తున్నార‌నే వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ రివీల్ చేసింది. దీంతో ఆ విష‌యం షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌బోతున్నారా? లేక న్యూ ఇయ‌ర్, క్రిస్మ‌స్ కానుక‌గా ఏదైనా స్పెష‌ల్ ప్లాన్ రివీల్ చేస్తున్నారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతుంది.

ఇక డాకు మాహారాజ్ కోసం బాల‌య్య అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అస‌లే గాడ్ ఆఫ్ మాసెస్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే మూడు విజ‌యాలు న‌మోద‌య్యాయి. దీంతో డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.

Tags:    

Similar News