అక్కినేని కొత్త జంట మిర్రర్ సెల్ఫీ.. అదిరిపోయిందిగా..
అయితే నాగ చైతన్య పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో నాగార్జున మరో అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ సినీ కుటుంబాల్లో ఒకటైన అక్కినేని ఫ్యామిలీ ఇంట వరుసగా వివాహ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్ద కొడుకు, యంగ్ హీరో నాగచైతన్య డిసెంబర్ 6వ తేదీన హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఏడడుగులు నడిచారు. అన్నపూర్ణ స్డూడియోస్ లో గ్రాండ్ గా చై, శోభిత మ్యారేజ్ జరిగింది.
అయితే నాగ చైతన్య పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో నాగార్జున మరో అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన రెండో కొడుకు అఖిల్ కు జైనబ్ రవ్జీతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపారు. దీంతో అక్కినేని వారసులిద్దరి పెళ్లి వేడుకలు ఒకేసారి జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగగా.. అది నిజం కాలేదు.
అఖిల్ వివాహం 2025లో జరగనున్నట్లు ఆ తర్వాత నాగార్జున క్లారిటీ ఇచ్చారు. 2024 తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఓవైపు ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరుగుతుండగా, మరోవైపు తన కొడుకులిద్దరూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని చెప్పారు. కానీ అఖిల్ వివాహం తేదీని మాత్రం రివీల్ చేయలేదు.
అయితే చైతన్య వివాహంలో అఖిల్, జైనబ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అనేక ఫొటోస్ లో ఇద్దరూ కలిసి కనిపించి సందడి చేశారు. ఇప్పుడు వారిద్దరి మిర్రర్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ దానిని అఖిల్ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేయగా.. ఆ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అందులో కొత్త జంట.. క్రేజీ వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్స్ లో అదరగొట్టారు. చైతూ పెళ్లిలో తీసుకున్న పిక్ గా తెలుస్తోంది. అదే సమయంలో నెటిజన్లు.. అఖిల్ పోస్ట్ చేసిన సెల్ఫీపై స్పందిస్తున్నారు. క్యూట్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కొనియాడుతున్నారు. పెళ్లి ఎప్పుడు అన్నా అని అక్కినేని అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు.
చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా మంచి పేరు సంపాదించుకున్న జైనబ్.. ఇండియాలోనే కాకుండా దుబాయ్, లండన్ లో కూడా ప్రదర్శనలిచ్చారు. హైదరాబాద్ లోనే పుట్టిన ఆమె ముంబైలో సెటిల్ అయినట్లు సమాచారం. జైనబ్ తో అఖిల్ కు రెండేళ్ల క్రితం పరిచయం అవ్వగా.. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు త్వరలో వివాహం బంధంగా మారనుంది.