అక్కినేని హీరో 'లెనిన్‌'..?

అఖిల్ అక్కినేని గత ఏడాది 'ఏజెంట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Update: 2024-12-16 04:43 GMT

అఖిల్ అక్కినేని గత ఏడాది 'ఏజెంట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2024లో ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయిన అఖిల్‌ వచ్చే ఏడాదిలో రెండు సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమాను అఖిల్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాతో పాటు ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిషోర్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు.

మురళి కిషోర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా చేయబోతున్న సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున సొంతంగా నిర్మించబోతున్నారు. అఖిల్‌ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆ పట్టుదలతోనే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ హిట్ కొట్టిన తర్వాతే అఖిల్‌ మీ ముందుకు వస్తాడు అంటూ ప్రకటించాడు. దాంతో అఖిల్ ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేయబోతున్నాడు అనిపిస్తోంది. అఖిల్‌ అక్కినేని హీరోగా ప్రస్తుతం వస్తున్న సినిమాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు అఖిల్ రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మురళి కిషోర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ వారు లెనిన్‌ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించారు అనే వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ లెనిన్‌ టైటిల్‌ను బ్లాక్‌ చేసిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అందుకే అఖిల్‌ను వచ్చే ఏడాదిలో లెనిన్‌గా చూడబోతున్నామనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

లెనిన్ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌తో అఖిల్‌తో మురళి కిషోర్‌ ఎలాంటి సినిమాను చేయబోతున్నాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న సినిమాను తీసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు మురళి కిషోర్‌ ఈ సినిమాతో స్టార్‌ దర్శకుడిగా మారడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ఈ కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఉన్నామంటూ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అఖిల్‌ కెరీర్‌లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News