అఖిల్.. ఆ రీమేక్ చేస్తే..

అక్కినేని యువ హీరో చివరిగా గత ఏడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు.

Update: 2024-07-27 23:30 GMT

అక్కినేని యువ హీరో చివరిగా గత ఏడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తనని తాను పూర్తిగా మార్చుకొని పెర్ఫెక్ట్ స్పై లుక్ లో కనిపించాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో నటించాడు. ఒళ్ళు హూనం చేసుకున్నాడు. అయితే ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఈ సినిమా తర్వాత కొత్త మూవీ కోసం అఖిల్ చాలా టైం తీసుకున్నారు. ఇప్పటి వరకు మూవీపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

అఖిల్ యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చుకున్నాడు. ఫుల్ గా గెడ్డం పెంచేసాడు. అయితే సినిమా గురించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందనేది కూడా క్లారిటీ లేదు. అఖిల్ చాలా కాలం నుంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఏజెంట్ తో ఆ కోరిక తీరుతుందని ఆశపడిన నిరాశే ఎదురైంది.

అయితే అతనికి కమర్షియల్ బ్రేక్ ఇచ్చే మూవీ కథ సిద్ధంగా ఉందని అక్కినేని ఫ్యాన్స్ ఉంటున్నారు. హిందీలో రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన కిల్ చిత్రాన్ని అఖిల్ తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఈ కథ, క్యారెక్టరైజేషన్స్ అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సరిపోతాయని భావిస్తున్నారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఈ కిల్ చిత్రంలో చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఈ కథని అఖిల్ చేస్తే కచ్చితంగా అతనికి సూపర్ హిట్ వస్తుందని చెబుతున్నారు.

అయితే ఏజెంట్ సినిమాతోనే అఖిల్ ఇప్పటికే యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా చేశారు. మరల వెంటనే కిల్ లాంటి యాక్షన్ బేస్డ్ మూవీ చేస్తే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అఖిల్ యాక్షన్ సన్నివేశాలలో ఎలాంటి డూప్ లేకుండా నటిస్తాడు. ఈ కారణంగా ఏజెంట్ సినిమా సమయంలో ఆయన గాయాలకు గురయ్యారు. అందుకే వెంటనే కిల్ కథ వచ్చిన చేసే అవకాశం లేదనే టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం అఖిల్ ఫోకస్ అంతా కూడా అనిల్ కుమార్ దర్శకత్వంలో చేయబోయే పీరియాడికల్ జోనర్ చిత్రంపైనే ఉంది. దానికోసం అతని లుక్ కూడా పూర్తిగా మార్చుకున్నాడు. గెడ్డం విపరీతంగా పెంచేసి కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్యలని కూడా అఖిల్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News