ఆ హీరోయిన్ కావాలంటున్న అఖిల్..!

అయితే అఖిల్ తన ఒపీనియన్ గా పూజా హెగ్దే పేరుని రిఫర్ చేశాడట. తెలుగులో బుట్ట బొమ్మ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.

Update: 2023-08-15 11:30 GMT

అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలకు గురి పెట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ యువి క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడితో ధీర అనే ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. ఇక ఆ సినిమాతో పాటుగా శ్రీకాంత్ అడ్డాలతో కూడా అఖిల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ధీర సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసి అది ఒక షెడ్యూల్ పూర్తి కాగానే శ్రీకాంత్ అడ్డాల సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట.

ధీర సినిమా పీరియాడికల్ కథతో వస్తుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ వేట మొదలు పెట్టారు. అయితే అఖిల్ తన ఒపీనియన్ గా పూజా హెగ్దే పేరుని రిఫర్ చేశాడట. తెలుగులో బుట్ట బొమ్మ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అమ్మడు సినిమాలో ఉంది అంటే గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా థై షోస్ తోనే ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది పూజా హెగ్దే. ఈ క్రమంలో పూజా అయితే సినిమా బెటర్ అని అఖిల్ అభిప్రాయపడుతున్నాడట. ఎలాగు పూజా హెగ్దేకి తెలుగులో సినిమాలేవి లేవు కాబట్టి అమ్మడు సైన్ చేసేందుకు వెనుకాడదు.

అదీగాక అఖిల్ పూజా హెగ్దే ఇద్దరు కలిసి చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అందుకుంది. అఖిల్ కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అదే అని తెలిసిందే. సో ఆ రకంగా కూడా అఖిల్ కి ఆమె లక్కీ హీరోయిన్ అయ్యింది. అందుకే అఖిల్ ధీర సినిమాకు పూజా కావాలని పట్టుబడుతున్నాడట. గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన పూజా తెలుగు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఓ పక్క రవితేజ గోపీచంద్ మలినేని కాంబో సినిమాకు పూజానే హీరోయిన్ అని అంటున్నారు. ఆ సినిమా గురించి కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

సో స్టార్స్ తో పాటుగా యువ హీరోలతో కూడా పూజా హీరోయిన్ గా చేస్తుంది. ఏజెంట్ తర్వాత అఖిల్ కథ విషయంలోనే కాదు కాస్టింగ్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నాడని తెలుస్తుంది. ఏజెంట్ లో హీరోయిన్ సాక్షి వైద్య ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది. అందుకే ధీర సినిమాలో కథానాయిక విషయంలో కూడా అఖిల్ తన ఇంట్రెస్ట్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు అఖిల్ కెరీర్ ని ఫాం లోకి తెస్తాయా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News