అకిరా ఎంట్రీ.. బాహుబలి లాంటి మాట
కానీ అకిరా ఎంట్రీ ఇస్తే మాత్రం ఈజీగా అతనికి మొదటి సినిమాకి 100 కోట్ల మార్కెట్ ఏర్పడిన కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరానందన్ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వాలి గాని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో నేటితరం హీరోలు ఎంట్రీ ఇచ్చిన విధానం వారి రేంజ్ కు తగ్గట్టుగా బాగానే బజ్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు అకిరా ఎంట్రీ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తనయుడు కావడంతో అతను గనక ఎంట్రీ ఇస్తే ఆ వైబ్ మాత్రం మామూలుగా ఉండదు.
చాలా రోజులుగా తల్లి రేణు దేశాయ్ కు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఆమె మాత్రం ఇప్పుడే ఆ విషయాన్ని అంతగా హడావిడి చేయకూడదు అని అనుకుంటున్నారు. కానీ అకిరా ఎంట్రీ ఇస్తే మాత్రం ఈజీగా అతనికి మొదటి సినిమాకి 100 కోట్ల మార్కెట్ ఏర్పడిన కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి ఆ స్థాయిలో మార్కెట్ లభిస్తూ ఉండడంతో ఎవరైనా సరే అంత ఈజీగా హీరో అయ్యే అవకాశాన్ని వదులుకోరు. కానీ అకిరా మాత్రం ఇప్పుడు హీరోగా లంచ్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు అని అతని ఫోకస్ మొత్తం కూడా స్కిప్ రైటింగ్ మ్యూజిక్ పైన ఉంది అంటూ రేణు దేశాయ్ వివరణ ఇస్తున్నారు. ఇక నిన్న జరిగిన టైగర్ నాగేశ్వరరావు ఈవెంట్లో అకిరా వైబ్రేషన్స్ కనిపించాయి.
ఏకంగా బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ గారే మీ అబ్బాయిని తప్పకుండా హీరోగా పరిచయం చేయాలి, మొదట మీరు తల్లిగా కనిపించాలి అని కోరారు. అందుకు రేణు దేశాయ్ కూడా చాలా సంతోషంగా రియాక్షన్ ఇచ్చారు. ఇండియన్ నెంబర్ వన్ స్టోరీ రైటర్ ఆ మాట అన్నారు అంటే అకిరా ఎంట్రీ పై ఎంతగా బజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. అలాగే మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అదే కోరుకున్నారు.
అకిరా హైట్ అలాగే అతని లుక్స్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కు మరో రూపంలో ఉన్నాయి. కాబట్టి అతని ఎంట్రీ మాత్రం పర్ఫెక్ట్ దర్శకులతో పడితే హడావుడి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవడం కష్టమే. ఏదేమైనాప్పటికీ కూడా అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ అతని నిర్ణయం ఎటువైపు గా ఉంటుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి.