అకిరా నందన్.. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ టీనేజ్ ను దాటేశాడు.

Update: 2024-07-04 06:13 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ టీనేజ్ ను దాటేశాడు. ఇప్పుడు 20లోనే అతను హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు. లుక్ పరంగా ఇప్పటికే ఆకట్టుకుంటున్నాడు. పవర్ స్టార్ అభిమానులు సైతంగా అకిరా నందన్ ని హీరోగా చూడాలని భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ రాబోయే హీరో అకిరా నందన్ అంటూ చెబుతున్నారు. తాజాగా ఏపీ ఎన్నికలలో విజయం తర్వాత అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువగా కనిపించాడు.

పవన్ కళ్యాణ్ తో కలిసి రెండు సార్లు ఢిల్లీ వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళినపుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా అకిరా నందన్ కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. దీంతో అకిరా నందన్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పవర్ స్టార్, మెగా అభిమానులు అకిరా నందన్ ఫోటోలని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

అకిరా నందన్ ని ఫ్యాన్స్ హీరోగా చూడాలని కలలు కంటున్న అతని ఇష్టాలు మాత్రం వేరుగా ఉన్నాయని గతంలో రేణు దేశాయ్ తెలిపారు. అకిరాకి యాక్టర్ కావాలనే ఇంటరెస్ట్ లేదని, అతని మ్యూజిక్ అంటే ఇష్టమని తెలిపారు. అలాగే అకిరా తన మ్యూజిక్ టాలెంట్ ని ఎప్పటికప్పుడు చూపిస్తున్నాడు. ఆ మధ్య మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో అకిరా కీబోర్డుపై యానిమల్ మూవీలో నాన్న సాంగ్ ప్లే చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అలాగే ఓ షార్ట్ ఫిల్మ్ కి కూడా అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

Read more!

ఇప్పటికే ఫిల్మ్ ట్రైనింగ్ కూడా అకిరా నందన్ తీసుకున్నాడంట. ఇదిలా ఉంటే అకిరా నందన్ ని హీరోగా లాంచ్ చేయడానికి ఇప్పటికే ఇద్దరు బడా నిర్మాతలు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. డివివి దానయ్య, ఏఎం రత్నం అకిరాని లాంచ్ చేయడానికి రెడీ అయ్యారంట. అతని కోసం కథలు కూడా సిద్ధం చేయిస్తున్నారంట. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాతలు కూడా అతనిపై ఫోకస్ చేస్తున్నారు.

అకిరా ఒకే అంటే నేరేషన్ ఇప్పించాలని అనుకుంటున్నారంట. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో సినిమాలు తగ్గించేశారు. అతని స్థానంలో జూనియర్ పవర్ స్టార్ గా అకిరా నందన్ ని చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ అయితే హీరో కావడం అనేది అకిరా నిర్ణయానికి వదిలేశారంట. తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలన్న, మెగా ఇమేజ్ ముందుకి తీసుకెళ్లే సత్తా అకిరాకి ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అతని నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News

eac