అక్కినేని సదారమ.. 4 రోజులు షూటింగ్ చేసి ఎందుకు ఆపేశారు..?

ఏవిఎం ప్రొడక్షన్ లో ఏఎన్నార్ లీడ్ రోల్ లో సదారమ అనే సినిమా మూడు రోజులు షూటింగ్ చేయగా సినిమాలో తన పాత్ర వల్ల అసంతృప్తిగా ఉన్న అక్కినేని సినిమా చేయడానికి నిరాకరించారట.

Update: 2024-09-22 06:57 GMT

తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్నార్ సినిమాలు ఎంతటి ప్రజాదరణ పొందాయన్నది అందరికీ తెలిసిందే. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఎలాంటి సినిమా అయినా ఏఎన్నార్ యాక్షన్ లోకి దిగారంటే అదిరిపోవాలంతే. ఐతే తెలుగు సినిమా పరిశ్రమ నట శిఖరంగా ఎదిగిన ఏఎన్నార్ కెరీర్ లో ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఆగిపోయిన విషయం చాలా తక్కువమందికి తెలుసు.

ఒక సినిమా ఒప్పుకునే టైం లో కొన్ని లెక్కలు వేసుకుని సెట్స్ మీద ఉన్నప్పుడు ఆ సినిమా ఎలా వెళ్తుంది అన్న ఆలోచనతో కొందరు సినిమాను మధ్యలో ఆపేస్తారు. ఐతే పాత కాలంలో ఇలా జరగడం చాలా అరుదు. అది కూడా ఏఎన్నార్ కెరీర్ లో మొదటిసారి అలా జరిగిందట. ఏవిఎం ప్రొడక్షన్ లో ఏఎన్నార్ లీడ్ రోల్ లో సదారమ అనే సినిమా మూడు రోజులు షూటింగ్ చేయగా సినిమాలో తన పాత్ర వల్ల అసంతృప్తిగా ఉన్న అక్కినేని సినిమా చేయడానికి నిరాకరించారట.

ఏవీఎం స్టూడియోస్ నిర్మిస్తున్న ఆ సినిమాలో అక్కినేనిది దొంగ వేషం. మూడు రోజులు షూటింగ్ చేశాక అక్కినేనికి ఆ పాత్ర నచ్చక చేయడం ఇష్టం లేదని ఏవీఎం వారితో చెప్పారట. ఐతే సినిమా చేస్తున్నారని పోస్టర్లు వేశాం.. డిస్ట్రిబ్యూటర్లకు చెప్పేశాం వాళ్లతో మాట వస్తుందని అన్నారట. ఐతే ఆ టైం లో అక్కినేని చక్రపాణి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారట. ఈ వేషంలో ప్రేక్షకులు తనని చూడలేరని. సినిమా నష్టం వస్తుందని ఏఎన్నార్ చక్రపాణితో చెప్పారట.

అప్పుడు చక్రపాణి ఏవీఎం వారికి ఫోన్ చేసి అక్కినేని ఈ సినిమా చేయడని చెప్పాడట. ఏఎన్నార్ పట్టుదల గల వాడు ఎంత చెప్పినా వినడని వారికి సర్ది చెప్పి సినిమా క్యాన్సిల్ చేయించారట. ఐతే అప్పటివరకు అయిన ఖర్చు ఏఎన్నార్ తిరిగి ఇచ్చేస్తానని అన్నా సరే ఏ వీ ఎం వారు వద్దన్నారట. ఐతే ఆ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ తో మరో సినిమా చేద్దామని అనుకున్నారత. అలా సదారమ బదులుగా భూ కైలాస్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు.

ఒకవేళ ఏఎన్నార్ కచ్చితంగా సదారమ చేయాల్సి వస్తే ఆయన చెప్పినట్టుగా అక్కినేనిని దొంగగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయే వారని చెప్పొచ్చు.

Tags:    

Similar News