నాకు కొట్టాల‌నిపించిన‌ప్పుడ‌ల్లా అక్క రంగంలోకి!

తాజాగా అక్ష‌ర హాస‌న్ త‌న స్కూల్ డేస్ లోకి వెళ్లిపోయింది. 'కొన్నిసార్లు అత్య‌వ‌స‌ర‌మైతే అక్క‌ను అడిగే అల‌వాటు ఉంది.

Update: 2024-07-18 23:30 GMT

సినిమాల్లోనే కాదు..రియాల్ లైఫ్ లోనే త‌మ్ముడు కోసం అన్న‌య్య‌..చెల్లి కోసం అక్క ఫైటింగ్ లు చేసిన సంద‌ర్భాలెన్నో ఉంటాయి. స్వ‌చ్ఛ‌మైన బంధాల మ‌ధ్య ఇలాంటివి త‌ప్ప‌నిస‌రిగా చోటు చేసుకుంటాయి. ఇంకా చెప్పాలంటే రియ‌ల్ లైఫ్ లో సినిమాని మించిన స‌న్నివేశాలెన్నో ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న త‌మ జీవితంలో కూడా ఉంద‌ని క‌మ‌ల్ హాస‌న్ చిన్న కుమార్తె అక్ష‌ర హాస‌న్ రివీల్ చేసింది.

శ్రుతి హాస‌న్-అక్ష‌ర‌హాస‌న్ సొంత అక్కాచెల్లెళ్లు అన్న సంగ‌తి తెలిసిందే. న‌టిగా శ్రుతిహాస‌న్ స‌క్సెస్ అయినా అక్ష‌ర హాస‌న్ మాత్రం స‌క్సెస్ అవ్వ‌లేదు. ఆమె కూడా సినిమాల వైపు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేసింది లేదు. తాజాగా అక్ష‌ర హాస‌న్ త‌న స్కూల్ డేస్ లోకి వెళ్లిపోయింది. 'కొన్నిసార్లు అత్య‌వ‌స‌ర‌మైతే అక్క‌ను అడిగే అల‌వాటు ఉంది. స్కూల్లో కొందరు ఏడిపిస్తున్నారు..గ‌ట్టిగా కొట్టాల‌ని ఉంద‌ని అక్క‌కి చెబితే హింస వ‌ద్ద‌ని సూచించింది.

నాకు అలా చెప్పి అక్క మాత్రం రంగంలోకి దూకేసింది. ప‌నికానిచ్చి సైలెంట్ గా నాకు ఏదీ చెప్పేది కాదు. నేను అంటే అక్క‌కు అంత ఇష్టం. మేం ఒక‌రి కోసం ఒక‌రు నిలండ‌తాం. ఇప్ప‌టికీ అలాగే ఉన్నాం. ఎన్ని స‌వాళ్లు ఎదురైనా మా కుటుంబంలో అంద‌రం ఒక‌రికోక‌రం ఎప్పుడూ స‌హ‌క‌రించుకుంటాం. ప‌రిస్థితులు బాలేద‌ని ఎవ‌రి దారిని వారు వెళ్లిపోం. అంతా ఒకే ఫ్యామీలి అన్న‌ది బ‌లంగా మా మ మ‌న‌సుల్లో పెన‌వేసుకున్నాం' అంది.

చూసారా చెల్లెలు అంటే శ్రుతిహాసన్ కి ఎంత ఇష్టమో. ఇద్ద‌రు క‌మ‌ల్ హాస‌న్ మొద‌టి భార్య సారిక కుమార్తులు అన్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ -సారిక 2002 లో విడిపోయాగా 2004 లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ -న‌టి గౌత‌మితో చాలా కాలం పాటు స‌హ‌జీవ‌నం చేసారు. అప్ప‌టికే గౌత‌మి మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకున్నారు. గౌత‌మికి సుబ్బ‌లక్ష్మి అనే కుమార్తె కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News