షాక్ ఇచ్చిన హీరో..అది సీక్వెల్ కాదండోయ్!

పరాజ‌యాల‌తో సంబంధం లేకుండా కిలాడీ అక్ష‌య్ కుమ‌ర్ కొత్త సినిమాల దూకుడు య‌ధావిధిగా కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-17 13:30 GMT

పరాజ‌యాల‌తో సంబంధం లేకుండా కిలాడీ అక్ష‌య్ కుమ‌ర్ కొత్త సినిమాల దూకుడు య‌ధావిధిగా కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా 16 ప్లాపులు వ‌చ్చినా? అత‌డింకా అంత‌కంత‌కు ఎక్కువ సినిమాలు చేయాలి? అన్న క‌సి ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నాడు. ఆ ర‌కంగా అక్ష‌య్ ని ప్ర‌శంసించాల్సిందే. ఇన్ని ప్లాప్ లొచ్చినా? త‌ర్వాత సినిమా చేయాలంటో ఎంతో ఆలోచిస్తారు.


కానీ అక్ష‌య్ మాత్రం ఎంతో న‌మ్మ‌కంతో...ధృడ సంక‌ల్పంతో ముందుకెళ్తున్నాడు. త‌ప్పులు స‌రిదిద్దు కుంటున్నాన‌ని చెబుతున్నా త‌ప్పా? థియేట‌ర్లో బొమ్మ ప‌డేస‌రికి అదే తప్పు మ‌ళ్లీ రిపీట్ అవుతుంది. ఆ సంగతి ప‌క్క‌న బెడితే ఆ మ‌ధ్య `త‌రంగా` సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. `లారోర్` ఫేం సంజ‌య్ పురాణ్ సింగ్ తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఇది `తిరంగా` సినిమాకి రీమేక్ కాద‌ని..ఓ కొత్త క‌థ‌తోనే సినిమా చేస్తున్న‌ట్లు తాజాగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం స్టోరీ సిద్ద‌మ‌య్యేద‌శ‌లో ఉంద‌ని, అన్ని ప‌నులు పూర్తి చేసి డిసెంబ‌ర్ లో సెట్స్ కి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవ‌రు? ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషీయ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌ట‌కు రానున్నాయి. తొలుత ఈ కాంబినేష‌న్ లో తిరంగ సీక్వెల‌గానే బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది.

అక్ష‌య్ కుమార్ సైతం ఓ సంద‌ర్భంలో దీని గురించి స్పందించారు. కానీ ఇప్పుడా ఆలోచ‌న విర‌మించు కుని కొత్త క‌థ‌తో ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ పుల్ బిజీగాసినిమాలు చేస్తున్నాడు. `స్కైపోర్స్`, `హేరాఫేరీ-3`, జాలీ ఎల్ ఎల్ బీ -3 చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News