'భూల్ భుల‌యా 3'లో ఖిలాడీ అక్ష‌య్?

ఈ బాలీవుడ్ హర్రర్ కామెడీలో అక్షయ్ కుమార్ అతిధి పాత్ర ప్రధాన హైలైట్‌లలో ఒకటి.

Update: 2024-08-21 03:15 GMT

ఇటీవ‌ల గూగుల్ ట్రెండింగ్ లో ఉన్న‌ సినిమా స్త్రీ 2. శ్రద్ధా కపూర్ - రాజ్‌కుమార్ రావు జంట‌గా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలి వారం భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ బాలీవుడ్ హర్రర్ కామెడీలో అక్షయ్ కుమార్ అతిధి పాత్ర ప్రధాన హైలైట్‌లలో ఒకటి. అక్ష‌య్ అద్భుత‌మైన‌ కామెడీ టైమింగ్‌తో చ‌క్కిలిగింతలు పెట్టాడు. స్త్రీ 3లో అతడి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది.

హారర్ కామెడీ జాన‌ర్ కి స‌క్సెస్ రేటు ఎక్కువ‌గా ఉంది. ఈ కేట‌గిరీలో నిరంత‌రం సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. స్త్రీ 2 తర్వాత మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ చిత్రం కార్తీక్ ఆర్యన్ -భూల్ భూలయ్యా 3. అక్షయ్ కుమార్ కూడా భూల్ భులయ్యా 3లో అతిథి పాత్రలో నటిస్తాడని క‌థ‌నాలొస్తున్నాయి. ఇది అక్కీ అభిమానులను చాలా ఎగ్జ‌యిట్ చేసే విష‌యం. అయితే అధికారికంగా ఇప్పుడు ఒక క్లారిటీ వ‌చ్చేసింది. ఈ క‌థ‌నాల‌న్నీ ఫేక్ అని అక్షయ్ కుమార్ స్వయంగా ధృవీకరించారు.

భూల్ భులయ్యా అద్భుత‌మైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఫ్రాంఛైజీ. మొద‌టి భాగంలో అక్ష‌య్ న‌టించ‌గా, రెండో భాగంలో కార్తీక్ ఆర్య‌న్ న‌టించాడు. ఆ రెండు సినిమాలు బంప‌ర్ హిట్లు. అయితే రెండో భాగంలో అక్ష‌య్ న‌టించ‌క‌పోవ‌డంపై అభిమానులు నిరాశ చెందారు. మూడవ భాగం ఇప్పుడు 2024 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇందులోను కార్తీక్ ఆర్య‌న్ నటిస్తున్నారు. విద్యాబాలన్, ట్రిప్తి డిమ్రీ కథానాయికలుగా నటిస్తున్నారు.

Tags:    

Similar News