క‌బుర్ల‌తో ప‌న‌వ్వ‌దు ..హిట్ ఎక్క‌డ ఖిలాడీ?

బాక్సాఫీస్ వ‌ద్ద ఏ సినిమా పోటీగా లేక‌పోయినా మిష‌న్ రాణిగంజ్ పేల‌వ‌మైన వ‌సూళ్లు తేవ‌డం అత్యంత దుర‌దృష్ట‌కరమంటున్నారు.

Update: 2023-10-10 01:30 GMT

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి స‌రైన హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతుంది. 'ఆత్రంగిరే' త‌ర్వాత హిట్ భూత‌ద్దం పెట్టి వెతికినా ఎక్క‌డా క‌నిపించ‌దు. 'ఆత్రంగిరే' త‌ర్వాత వ‌రుస‌గా ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవ‌న్నీ ఒకే రకమైనా ఫ‌లితాలు సాధించాయి. క‌నీసం ఓపెనింగ్స్ కూడా కానా క‌ష్ట‌మైన ప‌రిస్థితి క‌నిపిం చింది. తాజాగా రిలీజ్ అయిన 'మిష‌న్ రాణిగంజ్' కూడా అదే కోవ‌కు చెందిన చిత్రంగా క‌నిపిస్తుంది. ఈ సినిమా కేవ‌లం నాలుగు కొట్లు ఓపెనింగ్స్ మాత్ర‌మే తెచ్చింది.

అటుపై వారంతం వ‌సూళ్లు చూస్తే మొత్తంగా 12 కోట్లు క‌నిపిస్తుంది. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయిన చిత్రంగా బాలీవుడ్ ట్రేడ్ అంచ‌నాకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం రిలీజ్ అయిన సినిమాకి క‌నీసం సెల‌వు రోజులైన శ‌ని..ఆదివారాలు కూడా వ‌సూళ్లు రాక‌పోవ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

బాక్సాఫీస్ వ‌ద్ద ఏ సినిమా పోటీగా లేక‌పోయినా మిష‌న్ రాణిగంజ్ పేల‌వ‌మైన వ‌సూళ్లు తేవ‌డం అత్యంత దుర‌దృష్ట‌కరమంటున్నారు.

ఇక సినిమాకి రివ్యూలు నెగిటివ్ గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 'పార్క్' లాంటి సినిమాని కాపీ కొట్టి తీసాడ‌ని తొలి షోతోనే విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఈసినిమా బ‌డ్జెట్ 55 కోట్లు. వ‌చ్చిన వ‌సూళ్లు 15 కోట్లు. దీంతో న‌ష్టాలు ఏ రేంజ్ లో ఉన్నాయో క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. ఇక అక్ష‌య్ కుమార్ సినిమా రిలీజ్ కి ముందు త‌న సినిమా వ‌సూళ్లు తేవ‌డం లేద‌న్న అంశంపై విచారం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

అలాగే త‌న సినిమాల ద్వారా స‌మాజానికి వెళ్తోన్న సందేశాన్ని గుర్తు చేసారు. అయితే అక్ష‌య్ కుమార్ విచార‌ణ‌...సందేశం స‌క్సెస్ ని తీసుకు రాలేవు. కేవ‌లం సింప‌తీని మాత్ర‌మే తెస్తాయ‌ని మ‌రోసారి మిష‌న్ రాణిగంజ్ రిజల్ట్ తే తేట‌తెల్ల‌మైంది. బ‌ల‌మైన క‌థ‌..క‌థ‌నాలు..ప్రేక్ష‌కుల్ని మెప్పించేలా సినిమాలు చేయాలి త‌ప్ప‌! సందేశాలు...విచార‌ణ‌ల‌నేవి బాక్సాఫీస్ లెక్క‌లోకి రావు. మ‌రి ఇప్ప‌టికైనా ఖిలాడీ త‌ప్పిదాల్ని స‌రిద్దుకుని ముందుకు వెళ్తారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News