గోవా బీచ్‌లో ఆలయ బికినీ సెలబ్రేషన్
కెరీర్‌లో ఆరంగేట్ర సినిమాలతోనే నటిగా నిరూపించిన ఆలయ ఫర్నిచర్‌వాలా ఫిట్ నెస్ ఫ్రీక్ గాను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆలయ ఎఫ్ పరిచయం అవసరం లేదు. ప్రఖ్యాత నటి పూజా భేడి కుమార్తె. నేటితరం నటవారసురాళ్లలో ప్రతిభావంతమైన నటిగా పేరు తెచ్చుకుంది. కెరీర్‌లో ఆరంగేట్ర సినిమాలతోనే నటిగా నిరూపించిన ఆలయ ఫర్నిచర్‌వాలా ఫిట్ నెస్ ఫ్రీక్ గాను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిరంతరం యోగా భంగిమలను ప్రదర్శిస్తూ, జిమ్‌లో ఫిట్‌నెస్ సవాళ్లను స్వీకరించిన ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.
గత నెల ఆలయ ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో వృశ్చికాసనంలో కనిపించింది. క్రమం తప్పక యోగా, జిమ్ చేస్తుంది ఈ యువనటి. ఇప్పుడు అందుకు భిన్నంగా సూర్యాస్తమయాన్ని ఆస్వాధిస్తూ గోవా బీచ్ వాటర్స్ లో సెల్ఫ్ డ్రైవ్ మోడ్ లో కనిపించింది. అయితే ఆలయ సముద్రంలో నది కలిసే చోట ఇలా పాడిల్ బోర్డ్ పై ప్రయాణిస్తూ ఆశ్చర్యపరిచింది. ఈ బోర్డ్ ని తనకు తానుగానే డ్రైవ్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఇది నిజంగా సాహసంతో కూడుకున్న ప్రయాణం. కానీ ఆలయ ఎంతో ధైర్యంగా దీనిని సాధ్యం చేసి చూపిస్తోంది. స్టాండ్-అప్ ప్యాడిల్‌బోర్డ్ పై ఆలయ ఫిట్ అండ్ టోన్డ్ లుక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చుట్టూ పరిసరాల్లో అందమైన ప్రకృతి శోభాయమానంగా కనిపిస్తోంది. ఈ అడ్వెంచర్ ట్రిప్ లో ఆలయ ఎఫ్.వైట్ బికినీ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఆలయ పర్ఫెక్ట్ టోన్డ్ లుక్ ని ఈ బికినీ ఎలివేట్ చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... అలయ.ఎఫ్ చివరిగా రాజ్‌కుమార్ రావు నటించిన `శ్రీకాంత్` అనే బయోపిక్‌లో కనిపించింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన `బడే మియాన్ చోటే మియాన్` చిత్రంలో కూడా కనిపించింది. తదుపరి ఆదర్శ్ గౌరవ్ చిత్రం `ఖో గయే హమ్ కహాన్` సీక్వెల్ లోను నటిస్తోంది. అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి ఈ చిత్రంలో నటించనుంది.
తల్లిదండ్రుల నేపథ్యం...
ఆలయ నేపథ్యం పరిశీలిస్తే...అలయ ఎఫ్ 28 నవంబర్ 1997న లాస్ ఏంజిల్స్, యునైటెడ్ స్టేట్స్‌లో నటి పూజా బేడీ -వ్యాపారవేత్త ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్‌వాలా దంపతులకు జన్మించింది. ఆ సమయంలో ఆమె తల్లి తన కుటుంబంతో యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నారు. కానీ కాలగమనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో ఆలయ చాలా ఇబ్బందిని ఎదుర్కొంది. తర్వాత తన తల్లి పూజా భేఢితో కలిసి ఆలయ ముంబైకి వచ్చేసింది.