జస్ట్ మిస్ మ్యాం మ్యాం..తొడ,మెడ జారిపోయేవే!
బాలీవుడ్ బ్యూటీల ఫిట్ నెస్ ప్రీక్ లు అన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీల ఫిట్ నెస్ ప్రీక్ లు అన్న సంగతి తెలిసిందే. అందులోనూ నెటి జనరేష్ భామలైతే ఫిట్ నెస్ పై మరింత శ్రద్దతో ఉంటున్నారు. జిమ్, యోగా, డైట్ అంటూ ఓ టైమ్ టేబుల్ ఫాలో అవుతూ ఫిట్ నెస్ ని కాపాడుకుంటున్నారు. అలాగే రిస్క్ లు సైతం చేస్తున్న సందర్భాలుంటాయి. ఒకవేళ అవి తేడా కొడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా తెలుసు. తాజాగా యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ అలాంటి ఫీట్ చేయబోయి జస్ట్ మిస్ అయింది.
తేడా జరిగితే తొడ, మెడ రెండు కిందకు జారిపోయేవే. వివరాల్లోకి వెళ్తే అమ్మడు మార్నింగ్ షెడ్యూల్ లో భాగంగా జిమ్ములో కసరత్తులు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా హైబార్ మీద కాళ్లు , చేతులు ఒకేసారి ఉంచాలని ట్రై చేసింది. ఈ క్రమంలో వాల్ సహకారంతో రెండు కాళ్లను ఒకేసారి భుజం మీదకు ఎత్తుకోవాలని ట్రై చేసింది. ఈ క్రమంలో ఓ కాలు భుజం మీదకు వెళ్లగా..మరో కాలి కిందకి జారిపోయింది.
కొన్ని క్షణాల పాటు అలాగే ఉంది. దీంతో చేతులు లాగడం ఎక్కువ అవ్వడంతో మ్యాం మ్యాం అంటూ అరుపు అందుకుంది. వెంటనే పక్కనే ఉన్న కోచ్ చూసి దగ్గరకు వచ్చి కాళ్లను సరిచేసి కిందకు దించ డంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే అలయా కాళ్లు, చేతులు, మెడ అన్నీ జారిపోయేవి. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు తప్పనిసరిగా కోచ్ ఉండాలి? అన్నది ఈసారి బాగా అర్దమవుతుంది.
అందుకే అలవాటు లేని పనిచేసేటప్పుడు ముందుగా బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే రిస్క్ తీసుకున్నా సక్సెస్ అవుతుంది. లేకపోతే బుర్ర కిందకి..కాళ్లు మీదకి తేలిపోతాయి సుమీ తస్మాత్ జాగ్రత్త. ఇటీవలే అలయ్ ఎఫ్ నటించిన శ్రీకాంత్ బయోపిక్ `శ్రీ `రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.