యాక్షన్‌, రొమాన్స్ కాకుండా ఈసారి కొత్తగా..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇప్పటి వరకు రొమాంటిక్ పాత్రలతో పాటు యాక్షన్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

Update: 2024-12-04 07:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇప్పటి వరకు రొమాంటిక్ పాత్రలతో పాటు యాక్షన్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవలే ఈమె చేసిన ఆల్ఫా యాక్షన్‌ పాత్ర గురించి చర్చ జరిగిన విషయం తెల్సిందే. వరుసగా రొటీన్ పాత్రలు, సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బోర్‌ కొట్టించొద్దు అనే ఉద్దేశ్యంతో కొత్తగా ఏమైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ఆలియా భట్‌ మొదటి సారి పూర్తి స్థాయిలో హర్రర్‌ కాన్సెప్ట్ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో, హిందీ మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

హర్రర్‌ కామెడీ సినిమాల మేకర్‌గా గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ నిర్మాత దినేష్ విజయన్‌తో ఇటీవల ఆలియా భట్‌ భేటీ అయ్యారు. వీరితో పాటు ఒక దర్శకుడు సైతం ఉన్నారని తెలుస్తోంది. స్త్రీ, స్త్రీ 2 సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయిన దినేష్ విజయన్‌ నిర్మాణంలో ఆలియా భట్‌ సినిమా ఉంటుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఏంటి అనేది అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ కచ్చితంగా వీరి కాంబోలో రాబోతున్న సినిమా హర్రర్‌ కామెడీ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఆలియా భట్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన విభిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. గంగూభాయ్ వంటి విభిన్నమైన సినిమాను చేసి తన నటనతో మెస్మరైజ్ చేసిన ఆలియా భట్‌ ఈసారి హర్రర్‌ సినిమాతో భయపెట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ఆలియా భట్‌ హర్రర్ సినిమా గురించి అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. దెయ్యంగా భయపెట్టగలదు, దెయ్యం కారణంగా భయపడగలదు అంటూ ఆలియాపై నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తూ ఆమె హర్రర్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నామని అంటున్నారు.

వచ్చే ఏడాదిలో ఆల్ఫా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆలియా భట్‌ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది అనే నమ్మకంను ఆమె ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఆల్ఫా సినిమాలో ఆలియా పూర్తి స్థాయి యాక్షన్‌ సన్నివేశాలను చేసింది. ఆల్ఫా కోసం ఆలియా చాలా కష్టపడింది. 2025లో ఆల్ఫా విడుదల కానుండగా, 2026లో లవ్ అండ్‌ వార్‌ రానుంది. అదే ఏడాదిలో హర్రర్‌ కామెడీ మూవీని సైతం ఆలియా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News