మగాడిని మట్టి కరిపించడానికి 4నెలలు ట్రైనింగ్!
యశ్ రాజ్ ఫిలింస్ తొలిసారి లేడీ హీరోయిన్లతో `ఆల్పా` అనే స్పై చిత్రానికి సంకల్పించిన సంగతి తెలిసిందే
యశ్ రాజ్ ఫిలింస్ తొలిసారి లేడీ హీరోయిన్లతో `ఆల్పా` అనే స్పై చిత్రానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం కేవలం హీరోలతో మాత్రమే ఇలాంటి సాహసాలు చేసిన సంస్థ తొలిసారి లేడీ భామలతోనూ పూనుకుంది. ఇందులో అలియాభట్...శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ రావెల్ ప్రతిష్టా త్మకంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇందులో అలియా భట్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందన్నది తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు నెలలు పాటు ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటుందిట. పోషించేది గుఢచారి రోల్ కావడంతో శిక్షణ అనివార్యమైన భావించిన యూనిట్ ఆమెని ట్రైన్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అలాగే లుక్ పరంగా అలియాలో చాలా చేంజెస్ ఉంటాయని తెలుస్తోంది. పాత్ర కోసం మరింత స్లిమ్ గా మారుతుందంటున్నారు. అంటే అలియా ఉన్న బరువు కంటే మరింతగా తగ్గాల్సి ఉంటుంది. అలియా పాత్రకు సంబంధించి కీలకమైన ఆరు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట.
వాటికోసమే ఇంత ట్రైనింగ్ అవసరం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అందులో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్న బాబి డియోల్ ని అలియా మట్టికరిపించడం ఖాయం అంటున్నారు. బాబి పాత్ర సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందిట. తీవ్రవాది పాత్రని ఎంతో బలంగా రాసారుట. దీంతో ఆ పాత్రని ఎదుర్కోవాలంటే? ప్రత్యర్ధి కూడా అంతే బలంగా ఉండాలి అన్న కోణంలో అలియాని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలియాతో పాటు శార్వరీ వాఘ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అన్నది ఇంతవరకూ రివీల్ చేయలేదు. అలియా సహ నటిగా ఉంటుందా? లేక బాడి డియోల్ గ్యాంగ్ లో లేడీ బాస్ గా కనిపిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.