ఆలియా -ర‌ణ‌బీర్.. చూపులు క‌లిసిన శుభ‌వేళ!

ఇంత‌కుముందు ఇట‌లీలో క్రూయిజ్ షిప్ పార్టీ కోసం అంబానీలు ఏకంగా 800 మంది అతిథుల‌ను ఆహ్వానించారు

Update: 2024-06-26 17:03 GMT

ఆలియా భట్ - రణబీర్ కపూర్ హృదయాలను దొంగిలిస్తున్నారు. ఇంతంద‌మైన కెమిస్ట్రీతో ఇంటర్నెట్ లో అగ్గి రాజేయ‌డం ఇదే తొలి సారి కాదు కానీ....ఆ ఇద్ద‌రూ ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూస్తూ అనురాగంతో ప్రేమ‌తో క‌నిపిస్తుంటే అది చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేదు. ఈ ఫోటోల‌లో అంద‌మైన జంట క్యూట్ నెస్ ఓవ‌ర్ లోడెడ్. ఇంత‌కీ ఈ ఫోటోగ్రాఫ్స్ ఎక్క‌డి నుంచి లీక‌య్యాయి? అంటే.... అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ జంట‌ ప్రీ-వెడ్డింగ్ నుండి తాజా ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి!

ఇంత‌కుముందు ఇట‌లీలో క్రూయిజ్ షిప్ పార్టీ కోసం అంబానీలు ఏకంగా 800 మంది అతిథుల‌ను ఆహ్వానించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ క్రూయిజ్ పార్టీ స్వ‌ర్గ‌ధామంలో దేవ‌త‌ల పార్టీ చందంగా సాగిందని ప్ర‌శంస‌లొచ్చాయి. ఇక ఈ వేడుక‌లో బాలీవుడ్ హాట్ క‌పుల్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు. అందులో ఆలియా-ర‌ణ‌బీర్ జంట షో స్టాప‌ర్స్ గా నిలిచారు.

రిలేష‌న్‌షిప్ గోల్స్:

ఇక ఆలియా - రణబీర్ కపూర్ న‌డుమ గొప్ప అనుబంధానికి సింబాలిక్ గా ఐదు ర‌హ‌స్యాలు ఎవ‌రికీ తెలియ‌నివి ఇలా వెల్ల‌డ‌య్యాయి. అలియా భట్ తన పెళ్లి ఉంగరంపై రహస్యంగా ఆర్కే పేరును డిజైన్ చేయించింది. ఆలియా భట్ ఇతరుల మాదిరిగా కాకుండా రణబీర్ కపూర్ మాజీలు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌లతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉంది. ఈ అందమైన భామ‌లు ఆలియా గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. అలియా సైతం ఇటీవల దీపికా పదుకొణెను ట్రోల‌ర్స్ నుండి రక్షించింది. క‌త్రిన‌, దీపిక ఇద్ద‌రినీ ప్రేమిస్తున్నట్లు ఆలియా వెల్లడించింది. నా భాగస్వామి మాజీల‌తో ఎలా స్నేహంగా ఉండాలో నాకు తెలుసు. నేను ఆయ‌న‌ మాజీలు చాలా మంచి స్నేహితులం. నాకు వాళ్ళిద్దరూ ఇష్టమే.. అని ఆలియా అంది.

Read more!

రణబీర్ కపూర్ తమ వివాహ సమయంలో పండిట్ చెప్పే మంత్రాలు, ప్రమాణాలన్నింటినీ చురుకుగా వినేవాడ‌ని అలియా తెలిపింది. తొలి రేయి గదిలోకి ప్రవేశించిన అలియా భట్ తన అద్భుత క్షణాన్ని ఆస్వాధించింది. రణబీర్ కపూర్ తన అందమైన భార్యను చూసిన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి ఆలియా మాట్లాడుతూ, ''నేను రణబీర్ కపూర్ కళ్ళలో కన్నీళ్లు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అతని కళ్ళు చెమర్చాయి. నేను అతని వైపు చూస్తూ ఉండిపోయాను. అతను ఏడుస్తున్నట్లు చూశాను... అని తెలిపింది.

రణబీర్ కపూర్ తల్లి నీతూ సింగ్‌తో తనకు ఎలా లోతైన అనుబంధం ఉందో ఆలియా భట్ వెల్లడించింది. ఏప్రిల్ 2020లో రిషి కపూర్ కన్నుమూశారు. ఆ సమయంలోనే అలియా తన అత్తగారికి దగ్గరైంది. ''నా డైమండ్ రింగ్ మా రిలేషన్ ఫిలాసఫీతో చెక్కాము. ఇది నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. ప్రతి అక్షరం ఏదో ఒకదానిని సూచిస్తుంది.. కానీ నేను అదేమిటో ఎవ‌రికీ చెప్ప‌ను.. అని ఆలియా అంది.

Tags:    

Similar News