రాజమౌళి స్కెచ్ వేశాడంటే..!
బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే ఆయన సినిమా అంటే మీడియా అటెన్షన్ అంతా భారీగా ఉంటుంది
బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే ఆయన సినిమా అంటే మీడియా అటెన్షన్ అంతా భారీగా ఉంటుంది. అందుకే ఆయన సంథింగ్ స్పెషల్ గా చేస్తుంటాడు. RRR తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న రాజమౌళి ఆ సినిమా పూజా కార్యక్రమాలను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు. రాజమౌళి సినిమాకు ప్రత్యేకంగా పబ్లిసిటీ అవసరమా చెప్పండి. ఆయన సినిమానే ఒక బ్రాండ్ అందులోనూ మహేష్ తో చేస్తున్న సినిమా అనగానే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు పెరిగాయి.
ఐతే రాజమౌళి ఈ సినిమా పూజని ఇంత సైలెంట్ గా చేయడం వెనక పెద్ద స్కెచ్చే ఉందని తెలుస్తుంది. జక్కన్న సినిమా అంటే ఆరంభం నుంచే ప్రమోషనల్ ప్లానింగ్ అదిరిపోతుంది. సినిమా ఓ పక్క షూట్ చేస్తూనే ఆడియన్స్ ని సినిమాకు ఎంగేజ్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అన్నట్టు చేస్తాడు. ఐతే రాజమౌళి మహేష్ సినిమా గురువారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఐతే అది అంత సీక్రెట్ గా జరగడానికి రీజన్ ఒకటి మహేష్ లుక్ లీక్ అవ్వకూడదని చెబుతుంటే రెండోది రాజమౌళి కావాలనే ఇలా చేశారని అంటున్నారు.
మీడియా కు పూజా కార్యక్రమం లైవ్ ఇస్తే ఆ రెండు మూడు గంటలు అదే హడావుడి ఉంటుంది. కానీ అది ప్రైవేట్ గా చేయడంతో అది ఎప్పుడు ఇస్తారా అని అది వదిలేదాకా మీడియాలో చర్చ నడుస్తుంది. అసలు రాజమౌళి ఆ పూజా కార్యక్రమాన్ని మీడియాకు ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ ఆ సినిమా పూజకే ఈ రేంజ్ వార్తలు రావడం సినిమాపై ఉన్న అంచనాలను తెలియచేస్తుంది.
ముఖ్యంగా రాజమౌళి మహేష్ సినిమాపై ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సినిమా షూటింగ్ లో ఎలాగు రాజమౌళి సెల్ ఫోన్ నాట్ ఎలో అనేస్తాడు కాబట్టి ఆ సినిమా అంతా సీక్రెట్ గానే జరుగుతుంది. ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అంటే అది రాజమౌళి సినిమాతోనే ఇవ్వాలి. మరి జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో కానీ పూజా కార్యక్రమాలను సైలెంట్ గా చేయడం మాత్రం షాక్ ఇచ్చింది. ఇది మహేష్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసినా కూడా త్వరలో ప్రెస్ మీట్ తో మీడియా ముందుకు వస్తారని తెలుస్తుంది.