అందరి చూపు ఆగస్ట-15పైనే..కానీ ఆయన సైడిస్తాడా?
ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పాన్ ఇండియా చిత్రం `పుష్ప-2`ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదికి వచ్చేస్తామని గట్టిగానే చెబుతున్నారు. అంతకు మించి ఆలస్యం చేయడం తగదని భావిస్తోన్న టీమ్ ఆతేదికి వచ్చేలాగే షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు.
అందులోనూ హిందీ బెల్ట్ లో చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం భారీ వసూళ్లలో అత్యధిక షేర్ అక్కడి నుంచే ఉండటంతో అక్కడ మార్కెట్ ని ఏ మాత్రం మిస్ చేయదలు చుకోలేదు. 1000 కోట్ల వసూళ్లు పుష్ప -2 కి సాధ్యమే అన్నది ట్రేడ్ సైతం అంచనా వేస్తుంది. పైగా ఆగస్టు 15కి వస్తే కొన్ని సెలవులు కూడా కలిసొస్తున్నాయి. అందుకే పుష్ప-2 రిలీజ్ని ఆ తేదికి ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఒకవేళ పుష్పరాజ్ గనుక సైడ్ ఇస్తే ఆ తేదీకి తెలుగు సహా చాలా సినిమాలు రిలీజ్ రేసులో కనిపి స్తున్నాయి. `పుష్ప -2` ఆగస్టు నుంచి మరో నెలకి వాయిదా పడితే గనుక ఆరడజను సినిమాలు క్యూలో ఉన్నాయి. `దేవర`..`సరిపోదా శనివారం`.. `ఇండియన్-2`..`కంగువా`..`వెట్టైయాన్` లాంటి సినిమాలు రిలీజ్ రేసులోకి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే రోహిత్ శెట్టి కాప్ యూనివర్శ్ నుంచి `సింగం ఎగైన్` ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
హిందీ మార్కెట్ టార్గెట్ గా రిలీజ్ అవుతున్న చిత్రమది. కాబట్టి `పుష్ప-2`తో వాళ్లకేం ఇబ్బంది లేదు. థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు. కాబట్టి సింహం సింగిల్ గా వచ్చినా సమస్యేం లేదు. మిగతా సినిమాలే పుష-2 వాయితే పడితే బాగుండు.. ఆతేదికి బొమ్మ మేము వేసుకుంటాం? అన్న ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ సైడ్ ఇవ్వడం అంత ఈజీగా జరిగే పని కాదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.