సలార్ కి అన్ని థియేటర్స్ దొరకడం కష్టమేనా!
రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ మూవీ పార్ట్ 1 డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న సినిమా సలార్. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ మూవీ పార్ట్ 1 డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ సలార్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని భారీ స్క్రీన్స్ పై రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
కాని సలార్ కి ఒక రోజు ముందుగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగులో రావడం లేదు. కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో డంకీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. కాని హైదరాబాద్ లో మాత్రం డంకీ ఎక్కువ స్క్రీన్స్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. గతంలో సాహో, ఆదిపురుష్ సినిమాలకి హైదరాబాద్ లో వెయ్యి షోలు పడ్డాయి.
అయితే సలార్ మూవీకి అన్ని షోలు పడే అవకాశం లేదు. 60, 40 రేషియో తో థియేటర్స్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. సలార్ తో పాటు క్రిస్మస్ కానుకగా డంకీ, హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలకి 40 శాతం స్క్రీన్స్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. మిగిలిన 60 శాతం స్క్రీన్స్ లో సలార్ ని ప్రదర్శించనున్నారు. మూవీ సక్సెస్ బట్టి స్క్రీన్స్ సంఖ్య రెండో రోజు నుంచి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
ఈ మూవీకి సంబందించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే ఏమీ చేయడం లేదు. సినిమా నుంచి ఒక సాంగ్, యాక్షన్ ట్రైలర్ ని మాత్రమే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు ఆడియన్స్ కి రీచ్ అయితే సలార్ మూవీపై మళ్ళీ బజ్ క్రియేట్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అగ్రెసివ్ గా మూవీని ఆడియన్స్ లోకి పంపించాల్సిన అవసరం ఉంది.
మరి ఈ విషయంలో ప్రశాంత్ నీల్ టీం ఎలాంటి ప్లానింగ్ తో వెళ్తున్నారు అనేది అర్ధం కాకుండా ఉంది. నిర్మాత విజయ్ కిరంగదూర్ మాత్రమే ఇప్పటి వరకు మీడియా ముందుకి వచ్చి సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్రభాస్ ఏమైనా బయటకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.