డిసెంబర్ లో లెక్క తేలిపోతుందిలే!
'డిసెంబర్ 6' ఈ తేదీ కోసం ఎంతో ఉత్కంఠగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
`డిసెంబర్ 6` ఈ తేదీ కోసం ఎంతో ఉత్కంఠగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అటు ఐకాన్ అల్లు అర్జున్ అభిమానులు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకరు సినిమా సక్సెస్ చేయడం కోసం ఎదురు చూస్తుంటే? మరికొంత మంది అదే సినిమాని ఎలా డ్యామేజ్ చేయాలి? అనే ఆలోచనతో కదులుతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి హీరోల అభిమానలు బాహాబాహాకి దిగిన సంగతి తెలిసిందే.
ఏపీ రాజకీయాల నేపథ్యంలో వివాదం ఇలా సినిమా వరకూ దారి తీసింది. ఇప్పటికీ ఆ వార్ అలా కొన సాగుతూనే ఉంది. పవన్ అభిమానుల దాడిని బన్నీ ఆర్మీ ప్రతిఘటించి ముందుకెళ్తుంది. సినిమాపై ఓ హీరో అభిమానులు ఇప్పటి నుంచే నెగిటివ్ కామెంట్లకు తెరదించారు. సినిమా బాగోదని...ప్లాప్ అవుతుందని ఇలా ఇష్టారీతున పోస్టులు పెడుతున్నారు. ప్రతిగా బన్నీ ఆర్మీ వాటికి ధీటైన బధులిస్తుంది.
ఈ వార్ సినిమా రిలీజ్ వరకూ కొనసాగుతూనే ఉంటుంది. మరి దీనికి తెర ఎప్పుడు? అంటే డిసెంబర్ 6. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే? స్థానికంగా వ్యతిరేక వర్గం ప్రభావం ఎంత వరకూ ఉంటుంది? అన్నది చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాలు దాటి చూస్తే ఆ ప్రభావం ఎక్కడా ఉండదు. బన్నీకి మాలీవుడ్ లో..బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ నుంచి భారీ వసూళ్లు సాధిస్తాయి. ఓవర్సీస్ లోనూ తిరుంగుండదు.
ఈ పొలిటికల్ వార్ అనేది తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. ఏ సినిమా అయినా ప్లాప్ తెచ్చుకుంటే? బాక్సాఫీస్ వద్ద తేలిపోతుంది. అందులో ఎంత పెద్ద స్టార్ ఉన్నా? ఎలాంటి దర్శకుడు ఆ సినిమా తీసినా చేసేదేమి ఉండదు. కానీ `పుష్ప-2` మాత్రం `పుష్ప` మొదటి భాగానికి కంటున్యూటీ గా రిలీజ్ అవుతుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. కానీ కొన్ని రకాల వ్యతిరేక పవనాల నేపథ్యంలో ఎలాటి ప్రభావం పడుతుంది? అన్నది చూడాలి.