నార్త్ అమెరికాలో 'పుష్ప-2'.. లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..
విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న సినిమా.. ఇప్పటి వరకు రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ ఎలాంటి హిట్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదేమో! డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఆ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోగా.. ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది పుష్ప సీక్వెల్.
విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న సినిమా.. ఇప్పటి వరకు రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో హైయెస్ట్ గ్రాసర్స్ లిస్ట్ లో టాప్-2లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి-2ను బీట్ చేయాలని చూస్తోంది. క్రిస్మస్ హాలిడేస్, వీకెండ్ అండ్ న్యూ ఇయర్ తర్వాత అది ఈజీగా జరిగేలా కనిపిస్తోంది.
అయితే ముఖ్యంగా నార్త్ లో ఎన్నో ఘనతలు సాధించిన పుష్ప-2.. ఇప్పటి వరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నార్త్ అనే కాదు.. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా భారీగా వసూలు చేస్తోంది. అదే సమయంలో నార్త్ అమెరికాలో పుష్ప-2 సినిమా ఇప్పటి వరకు 14.9 మిలియన్ డాలర్స్ ను రాబట్టి ఇంకా దూసుకుపోతోంది.
ఈ మేరకు మేకర్స్.. సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే నార్త్ అమెరికాలో పుష్ప సీక్వెల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 మిలియన్ డాలర్స్ గా తెలుస్తోంది. దీంతో అతి త్వరలో అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోనుందన్నమాట. అదే సమయంలో మరో రికార్డు బ్రేక్ అవ్వనుంది.
ఆర్ఆర్ఆర్ నార్త్ అమెరికాలో 15.3 మిలియన్ డాలర్స్ వసూలు చేయగా.. ఆ రికార్డును పుష్ప-2 కచ్చితంగా బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసే లోపు మరిన్ని ఘనతలు సాధించనుందని.. ఇంకెన్నో రికార్డులను పుష్ప-2 మూవీ బ్రేక్ చేయనుందని సినీ పండితులు చెబుతున్నారు.
ఇక పుష్ప-2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. సునీల్, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, అజయ్ ఘోష్, జగదీష్, అనసూయ, రావు రమేష్ తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బన్నీ, రష్మిక సహా అందరూ తమ నటనతో ప్రశంసలు అందుకున్నారు.