3,4 నెలల్లో పుష్ప 2 రికార్డులు బ్రేక్.. అల్లు అర్జున్ వైల్డ్ సెన్సేషనల్ కామెంట్స్..!

సినిమా సక్సెస్ సాధించిన క్రమంలో చిత్ర యూనిట్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ ఫ్యాన్స్ ని అలరించింది.

Update: 2024-12-12 11:14 GMT

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా రిలీజైన ఆరు రోజుల్లోనే సినిమా 1000 కోట్ల మార్క్ దాటేసింది. సినిమా సక్సెస్ సాధించిన క్రమంలో చిత్ర యూనిట్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ ఫ్యాన్స్ ని అలరించింది.

ముందుగా నమస్తే.. నమస్తే.. అంటూ మొదలు పెట్టిన అల్లు అర్జున్ థాంక్యూ ఇండియా అని అన్నారు . ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని అన్నారు . పీపుల్ ఆఫ్ ఎక్రాస్ ది కంట్రీ కు థాంక్స్. ఇది లవ్ కాదు వైల్డ్ లవ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా. ఈసారి ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ అని అన్నారు.

ఈ సినిమాను ఆదరించిన వరల్డ్ వైడ్ ఇండియన్స్. గ్లోబల్ లెవెల్ లో ఇండియన్ సినిమాలు చూస్తున్న వారికి థాంక్స్ అని చెప్పాడు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మరో డైలాగ్ చెప్పాడు. ఇక ఇంతటి ఘన విజయం సాధించడానికి ఎంటైర్ టీం ఆఫ్ పుష్ప కి థాంక్స్. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, యాక్టర్స్, టెక్నిషియన్స్ అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. అందరికన్నా ఎక్కువ సుకుమార్ కు ఎక్కువ క్రెడిట్ వస్తుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు సుకుమార్. హి ఈజ్ రూలింగ్ ఇండియన్ బాక్సాఫీస్ అని అన్నారు అల్లు అర్జున్.

హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ పుష్ప 1కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేశారు. పుష్ప 2 కి అదే రేంజ్ సపోర్ట్ అందిస్తున్నారు. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళి, తెలుగు పరిశ్రమల నుంచి సపోర్ట్ వచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి థాంక్స్ అని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్.

ఒక సినిమా సక్సెస్ ని అన్ని స్టేట్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇది నా విజయం కాదని ఇది దేశం విజయం అని అన్నారు అల్లు అర్జున్. ఒక పుష్ప రాజ్ గా కాదు ఒక ఇండియన్ గా చెబుతున్నా ఇండియా లీడింగ్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ అని అన్నారు. స్పీచ్ లో భాగంగా మేరా భారత్ మహాన్ అని అన్నారు అల్లు అర్జున్. పుష్ప 2లో ఫేవరెట్ మూమెంట్ గురించి చెబుతూ యాటిట్యూడ్ ఆఫ్ ఎవరీ ఇండియన్. అందుకే సినిమా చేస్తున్న ప్రతి సందర్భంలో తగ్గేదేలేదు అనుకున్నా అన్నారు.

ఐతే ఈ రికార్డులను కూడా మళ్లీ త్వరగానే వేరే వాళ్లు బ్రేక్ చేయాలని అన్నారు. ఇక పుష్ప 2 సినిమా చూశాక 38 కోట్ల భర్తలకు మీరేం చెబుతారంటే భార్య మాట వినండని అన్నారు అల్లు అర్జున్. వైద్ దగ్గర తగ్గాలని నవ్వుతూ చెప్పారు.

Full View
Tags:    

Similar News