క్రేజే కాదు.. వాటిని కూడా బన్నీ భారీగానే..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజే వేరు. ఒక్క మూవీతో పాన్ ఇండియా వైడ్ గా వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు.

Update: 2024-08-28 11:29 GMT

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజే వేరు. ఒక్క మూవీతో పాన్ ఇండియా వైడ్ గా వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ముఖ్యంగా ఆయనేం చేసినా.. అందులో ఒక స్టైల్ కచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన్ను ఒకప్పుడు ఫ్యాన్స్ ముద్దుగా స్టైలిష్ స్టార్ అని పిలుచుకునేవారు. ఏ పని చేసినా.. అందులో తనకంటూ గుర్తింపు ఉండేలా చేస్తారని ఫ్యాన్స్ చెబుతుంటారు. భిన్నత్వాన్ని కోరుకుంటారని అంటుంటారు.

ఇప్పుడు తన కొత్త ఇంటి విషయంలో కూడా బన్నీ అలాగే ఆలోచిస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే కెరీర్ పరంగా పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్.. త్వరలో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప సీక్వెల్ విడుదలకు ముందే మంచి ముహుర్తంలో గృహప్రవేశం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు కూడా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ వెంకటగిరి ఏరియాలో రీసెంట్ గా కోట్ల విలువైన ఆస్తులను అల్లు అర్జున్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులోనే ఇల్లుతోపాటు ఆఫీస్ ను నిర్మిస్తున్నారని సమాచారం. 3,000 చదరపు గజాల స్థలంలో అత్యంత విలాసవంతంగా, ఖరీదైన హంగులతో ఇంటి నిర్మాణం జరుగుతుందని వినికిడి. ఇప్పటికే బన్నీ రూ.100 కోట్ల విలువైన ఇల్లు 'బ్లెస్సింగ్' ఫుల్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అలా తన ఆస్తులను భారీగా బన్నీ విస్తరించుకుంటున్నట్లు సినీ పండితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నిర్మితమవుతున్న బిల్డింగ్ వర్క్స్ ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అయ్యాయి. వచ్చే ఏడాది స్టార్టింగ్ కల్లా పూర్తవుతుందట. కానీ నవంబర్ లో బన్నీ సతీసమేతంగా గృహప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో కెల్లా అత్యంత ఖరీదైన ఇంటిగా రూ.100 కోట్లకుపైగా బడ్జెట్ తో భారీగా తీర్చిదిద్దుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, బన్నీ కొత్త ఇల్లు.. దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికి దగ్గర్లోనే ఉందని తెలుస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ కూడా అక్కడేనట. అయితే తన ఫ్యాన్స్ కోసం స్పెషల్ రూమ్ లాంటిది కూడా బన్నీ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ తన క్రేజ్ ను పెంచుకుంటున్నట్లే.. ఆస్తులు కూడా వేగంగా పెంచుకుంటున్నారన్న మాట. మరి బన్నీ కొత్త ఇల్లు ఎలా ఉంటుందో? ఎలాంటి హంగులతో రూపుదిద్దుకుంటుందో? ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News