యూఎస్ లో చరణ్ మెగా మాస్ యుఫోరియా

ఇండియాకి వెలుపల జరిగిన ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇదే కావడంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

Update: 2024-12-23 06:54 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ యూఎస్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మేగ్జిమమ్ మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్ అటెండ్ అయ్యింది. ఇండియాకి వెలుపల జరిగిన ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇదే కావడంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో గేమ్ చేంజర్ సినిమా గురించి అందరూ మాట్లాడారు. సుకుమార్ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ఇదిలా ఉంటే ‘గేమ్ చేంజర్’ టీమ్ యూఎస్ పర్యటనకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ తో పాటు మూవీ టీమ్ మొత్తాన్ని ఇన్వైట్ చేయడానికి ప్రత్యేకంగా బైక్స్, కార్లు ర్యాలీ నిర్వహించారు.

ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ జరిగిన ప్లేస్ వరకు ఈ ర్యాలీ జరిగింది. మెగా ఫ్యాన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ‘గేమ్ చేంజర్’ యూఎస్ టెక్సాస్ డిస్టిబ్యూటర్స్ రాజేష్ కళ్లేపల్లి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి ముందు సెలబ్రెటీ గెస్ట్ లని రిసీవ్ చేసుకొని హోటల్స్ కి తీసుకెళ్తున్న విజువల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. అలాగే ఫోటోల కోసం ఫ్యాన్స్ హంగామా కనిపించింది. ఇందులో రామ్ చరణ్, సుకుమార్, బుచ్చిబాబు, సుమ కనకాల ఉన్నారు.

ఇక మెగా ఫ్యాన్స్ కూడా ‘గేమ్ చేంజర్’ టీమ్ కి ఈ వీడియోలో వెల్ కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ యుఫోరియా ఈ వీడియోలో కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ‘గేమ్ చేంజ’ర్ జనవరి 10న ఫెస్టివల్ కానుకగా థియేటర్స్ లోకి వస్తోంది. నాలుగు భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.

కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లో సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమా కోసం ప్రధాన పట్టణాలలో మెగా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్స్ ద్వారా సినిమాకి హైప్ తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ‘ఇండియన్ 2’ లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి ఈ మూవీ వస్తోంది. అయితే ఈ మూవీతో శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతారని భావిస్తున్నారు.

Tags:    

Similar News